జీఎంఆర్ కాకినాడ పవర్ ప్లాంటు రూ.400 కోట్లకు విక్రయం
హైదరాబాద్: కాకినాడ వద్ద ఉన్న 220 మెగావాట్ల గ్యాస్ ఆధారిత పవర్ప్లాంటును సుమారు రూ.400 కోట్లకు ఓ కంపెనీకి విక్రయిస్తున్నట్టు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. త్వరలో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోనున్నట్టు వెల్లడించింది. జీఎంఆర్ ఈ ప్రాజెక్టుకు చేసిన వ్యయం రూ.600 కోట్లు. ఈ ప్లాంటు 2001లో ప్రారంభం అయింది. సహజవాయువు కొరత కారణంగా 2013 నుంచి ప్లాంటులో విద్యుత్ఉత్పత్తి నిలిచిపోయింది.