డీపీఆర్సీ భవనం పరిశీలన
కడప అగ్రికల్చర్ :
జిల్లా పంచాయితీ రిసోర్స్ సెంటర్ భవనాన్ని రాష్ట్ర కమిటీ పరిశీలించింది. శనివారం కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వెనుకభాగాన నూతనంగా నిర్మించిన భవనాన్ని కాళహస్తి శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ ప్రశాంతి పరిశీలించారు. శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చాలా చక్కగా ఉందని అన్నారు. గతంలో పంచాయితీరాజ్ శాఖ అధికారులు శిక్షణ నిమిత్తం చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. ఇప్పుడు దీనిని వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ మె వెంట శిక్షణ కేంద్రం ప్యాకల్టీ జుబేదా బేగం, అసిస్టెంట్ ఇంజనీరు వెంకటరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.