‘మమ్మల్ని దేవుడే కాపాడాలి’
పాట్నా(బిహార్): ఆర్జేడీ మాజీ ఎంపీ షహబుద్దీన్ జైలు నుంచి విడుదల కావడంతో అతడి బాధితులు వణికిపోతున్నారు. ఇక ప్రాణాలు గాల్లో దీపాలని భయాందోళన చెందుతున్నారు. 2014లో ముగ్గురు సోదరులు సతీష్, గిరీష్, రాజీవ్ రోషన్ హత్య కేసులో షహబుద్దీన్ కు జీవితఖైదు పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న షహబుద్దీన్ 11 ఏళ్ల అనంతరం బెయిల్పై బయటికొచ్చారు.
షహబుద్దీన్ విడుదల కావడం తమకు బాధ, భయం కలిగిస్తున్నాయని అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు సోదరుల తల్లి కళావతి దేవి అన్నారు. ఇక తమకు దేవుడే రక్ష అని కళావతి భర్త చంద్రకేశ్వర్ ప్రసాద్ పేర్కొన్నారు. తమ ముగ్గురు కొడుకులను దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాము సివాన్ ప్రాంతంలో నివసించలేమని చెప్పారు.