వైభవంగా సామూహిక వ్రతాలు
కాళ్ల : గ్రామంలోని స్వయంభూ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సుమారు 450 మంది పాల్గొని స్వామివారి వ్రతాలు ఆచరించారు. తాడినాడ గ్రామానికి చెందిన వేగేశ్న వెంకట సూర్య సత్యనారాయణ రాజు– సూర్య లక్ష్మి దంపతులు వ్రతాల్లో పాల్గొన్న వారికి అన్నవరం స్వామివారి ప్రసాదం, ప్రతిమ అందజేశారు. గూట్లపాడుకు చెందిన ఆరేటి సత్యనారాయణ, నాగ పుష్పావతి ప్రసాద వినియోగం ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ అడ్డాల వెంకట గణపతిరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.