kallu Victims
-
కల్లుసీసాలో పాము అవశేషం
శ్రీరంగాపూర్ (కొత్తకోట): పెబ్బేరు మండలం తోమాలపల్లిలోని కల్లుదుకాణంలో సీసాలో ఓ పాము అవశేషం రావడం ఆందోళనకు గురిచేసింది. అదే గ్రామానికి చెందిన ఒకరు కల్లు తా గుతుండగా అందులో చనిపోయిన పాము అవశేషం బయటపడింది. సగం తాగిన తర్వా త విషయం తెలవడంతో ఆమె ఏమైనా జరుగుతుందోనని భయపడింది. ఉదయం నుంచి కల్లు తాగిన వారు ఆందోళనకు గురై కల్లు దుకా ణ యజమానితో గొడవకు దిగారు. ఆయన అందరిని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. -
'ఎంతటి వారైనా ఊరుకోం'
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు భాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. బుధవారం జిల్లాలో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కల్తీ కల్లు తయారీని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడితే ఎంతటి వారైనా ఊరుకోమని హెచ్చరించారు. రసాయనాలు కలిపిన కల్లు వల్లే అనారోగ్యపాలవుతున్నారన్నారు. తెలంగాణలో కల్తీ కల్లు మరణాలు లేవని స్పష్టం చేశారు. అదేవిధంగా గుడుంబాపై ఉక్కు పాదం మోపుతామని తెలిపారు. కాగా జిల్లాలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై 256 మంది ఆస్పత్రి లో చేరారు. ఇందులో 62 మంది మహిళలు ఉన్నారు. ప్రమాదకర పదార్థాలను కలిపిన కల్లును తాగిన వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. -
కలకలం రేపుతున్న కల్తీ కల్లు !
నిజామాబాద్ జిల్లాలో ఒకేరోజు 256 మంది ఆస్పత్రిపాలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆస్పత్రుల్లో చేరుతున్న ‘కల్లు’ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో అస్వస్థతకు గురై మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరగా... జిల్లావ్యాప్తంగా మంగళవారం 256 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇందులో 62 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో ఈత, తాటి చెట్లు లేక కృత్రిమ కల్లు అవసరం ఏర్పడటం.. ‘కల్లు మాఫియా’ కల్తీకల్లు అలవాటు చేయడం.. చివరికి ప్రభుత్వం ఇలాంటి కల్లుపై ఉక్కుపాదం మోపడంతో కల్లుకు బాని సలైన వారు మరణాలు, ఆస్పత్రుల పాలవుతున్నారు. కల్లులో రసాయన పదార్థాల మోతాదు తగ్గి మాక్లూరు, కామారెడ్డి, నిజామాబాద్ మండలాల్లో మూడు రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందగా... మంగళవారం నందిపేట మండలం ఐలాపూర్కు చెంది న బంజ మాధవరావు (60) తనువు చాలించాడు. ప్రమాదకర పదార్థాలను కలిపిన కల్లును తాగిన వారు, ప్రస్తుతం కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు.