kaluvapalli
-
హత్య కేసులో మరో ముగ్గురు అరెస్టు
బెళుగుప్ప : మండల పరిధిలోని కాలువపల్లి వద్ద ఈనెల 22న జరిగిన హరిజన సోమశేఖర్ (25) హత్య కేసులో ఇప్పటికే ప్రదాన ముద్దాయి హరిజన ఆంజినేయులును అరెస్టు చేసిన పోలీసులు గురువారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ వివరాలను ఎస్ఐ నాగస్వామి విలేకరులకు తెలిపారు. ఆంజినేయులుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఈ హత్య కేసులో పాల్గొన్నట్లు తేలిందన్నారు. ఆంజినేయులుకు తన సమీప బంధువులు అయిన ఆత్మకూరుకు చెందిన హరిజన నాగరాజు, కాలువపల్లికి చెందిన హరిజన కిరణ్, హరిజన పెద్దన్నలు కూడా ముద్దాయిలేనన్నారు. వీరిని గురువారం గోళ్ల గ్రామానికి సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయ పరిసరాల్లో ఉండగా తమ అదుపులోకి తీసుకున్నామన్నారు. కళ్యాణదుర్గం కోర్టుకు హాజరుపరచగా ఆగస్టు 9 వరకు కోర్టు రిమాండ్ విధించిందని చెప్పారు. -
యువకుడి దారుణహత్య
బెళుగుప్ప: కాలువపల్లి వద్ద శనివారం రాత్రి ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కాలువపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న సోమశేఖర్ (25)కు ఇదే కాలనీలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. శనివారం రాత్రి గ్రామ సమీపంలోకి వెళ్లిన సోమశేఖర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. ఎస్ఐ నాగస్వామి, ఏఎస్ఐ విజయనాయక్లు ఆదివారం ఉదయం గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సీఐ శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు గుర్తించారు. వివాహిత భర్త ఆంజనేయులు ప్రధాన నిందితుడుగా నిర్ధారించారు. అయితే హత్య చేసిన ఘటనలో ఒకరే పాల్గొన్నారా.. మరికొంతమంది ఉన్నారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.