చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
కేసముద్రం : మనస్తాపంతో పురుగుమందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని కల్వల గ్రామంలో చోటుచేసుకుంది.
ఎస్సై ఫణిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామగిరి వీరయ్య(75)కు గత రెండేళ్లుగా కళ్లు కనిపించడం లేదు. అతడి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండటం లేదు. దీంతో మనస్థాపానికి గురైన వీరయ్య ఈనెల 5న సాయంత్రం ఇంట్లో పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఎంజీఎంకు S తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.