బావిలో పడి మహిళ మృతి
కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గంలోని సుబ్రమాణ్ణేశ్వర స్వామి ఆలయం ఎదుటనున్న బావిలో పడి కుందుర్పి మండలం చిన్నంపల్లికి చెందిన శంకర్ భార్య భారతి(38) బుధవారం మరణించినట్లు ఎస్ఐ శంకర్రెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఇంటికి తిరిగొస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి ఆమె బావిలో పడిపోయిందన్నారు.
స్థానికులు గమనించి తమకు సమాచారం అందించారని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మృతురాలికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.