జాతీయగీతంపై పోస్టు: రచయిత అరెస్టు
కొల్లం: జాతీయ గీతాన్ని అవమానిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఓ రచయితపై రాజద్రోహం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయగీతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మళయాళీ రచయిత, థియేటర్ ఆర్టిస్ట్ కమల్ సీ చవరాను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఫేస్ బుక్ లో ఆయన చేసిన పోస్టులను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
కేరళ రాష్ట్ర బీజేపీ యువ మోర్చాకు చెందిన యూత్ వింగ్ ఈ మేరకు కమల్ పై కొల్లంలోని ఓ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో కోజికోడ్ లో నివసిస్తున్న కమల్ ను అరెస్టు చేసి కొల్లంకు తీసుకువచ్చినట్లు చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన అంతర్జాతీయ కేరళ ఫిల్మ్ ఫెస్టివల్(ఐఎఫ్ఎఫ్ కే)లో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో లేచి నిలబడనందుకు 12మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.