ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
రాంచీ: హత్యాయత్నం, దోపిడీ కేసులో జార్ఖండ్ చెందిన ఏజేఎస్‌యూ ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్‌కు ఏడేళ్ల జైలు శిక్షపడింది. మంగళవారం రాంచీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
23 ఏళ్ల కిందటి ఈ కేసులో కమల్‌తో పాటు మరో ఏజేఎస్‌యూ సభ్యుడిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. కమల్‌ను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. 1993లో డాక్టర్ కే కే సిన్హా ఇంటికి వెళ్లి పార్టీకి విరాళం ఇవ్వాలని కోరారు. చందా ఇచ్చేందుకు సిన్హా నిరాకరించడంతో ఆయనపై దాడికి పాల్పడి అవతలకు తోసేశారు. జార్ఖండ్‌లో బీజేపీ మిత్రపక్షంగా ఏజేఎస్‌యూ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి.