కోర్టు తీర్పుపై భరోసా
టీఏపీవేటా రాష్ట్ర అధ్యక్షులు కమలాకర్ రావు
సప్తగిరికాలనీ : పాఠశాలల పునఃప్రారంభం నాటికే ఆర్ట్, పీఈటీ, వర్క్ ఎడ్యుకేషన్ టీచర్ల కాంట్రాక్ట్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు రావాల్సి ఉండగా, సర్వ శిక్ష అభియాన్ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికి రాలేదని, ఇక కోర్టు తీర్పుపై భరోసా పెట్టుకున్నామని టీఏపీవెటా రాష్ట్ర అధ్యక్షుడు కె.కమలాకర్‌రావు తెలిపారు. కరీంనగర్లో ఆదివారం జరిగిన సంఘం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గత నెల నుంచి అన్ని కాంట్రాక్టు పోస్టుల గడువు ఈ విద్యాసంవత్సరానికి పొడిగించేందుకు ప్రయత్నాలు చేసినా న్యాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. చివరికి పోస్టుల సాధనకు కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. పక్క రాష్ట్రాల్లో జూన్ 12వ తేదీననే కాంట్రాక్టు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, తెలంగాణలో ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదన లేక పోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సమావేశంలో టీఏపీవెటా వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ మోహన్, జిల్లా అధ్యక్షుడు తాడూరి లక్ష్మీనారాయణ, గీతారాణి, యజ్ధాని, వెంకటేశం, రఘు, కేశవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.