కేసీఆర్ తో కెనడా బృందం భేటీ
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో కెనడాకు చెందిన చైర్ ఫాక్స్ ప్రతినిధి బృందం మంగళవారం భేటీ అయింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై ఈ సమావేశంలో చేర్ ఫాక్స్ కంపెనీ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ తో చర్చించారు. అంతేకాకుండా తెలంగాణలో రోడ్ల అభివృద్ధి, విద్యుత్, మంచినీటి ప్రాజెక్టులు మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతినిధి బృందం అధికప్రాధాన్యం కల్పిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.