సిద్ధార్థ అకాడమీ ఎదుట విద్యార్థుల ధర్నా
విజయవాడ: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌కు సభకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తూ.. సిద్ధార్థ అకాడమీ ఎదుట గురువారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. దేశద్రోహానికి పాల్పడ్డ వ్యక్తికి సభను నిర్వహించడానికి అనుమతిచ్చి కాలేజీ ప్రతిష్టను మంటగలుపుతున్నారంటూ ఇంఛార్జ్ రమేష్‌పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్హయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీ వ్యతిరేక శక్తులను కాలేజీలోకి అడుగుపెట్టనివ్వబోం అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.