విజయవాడలో పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు, ఇతర దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ కనకదుర్గ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయమే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వేకువజామునుంచే భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ రోజు లక్షన్నర వరకు భక్తులు రావచ్చని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం, అనంతపురం జిల్లా పెన్నహోబిళం, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.