షవర్ల కిందే పుష్కర స్నానాలు..
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు, తడపాకల్, ఉమ్మెడ, తుంగిని పుష్కర ఘాట్ల వద్ద భారీ సంఖ్యలో యాత్రికులు పుష్కర స్నానాలు ఆచరించారు. కందకుర్తి, తాడ్ బిలోలిలో నీళ్లు లేక షవర్ల కిందే స్నానాలు చేస్తున్నారు. ఈ ఘాట్లలో అన్ని చోట్ల భద్రత పెంచడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గోదావరి పుష్కరాల కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. రెండో రోజు కూడా భక్తులు నీళ్లు లేకపోవడంతో పుష్కర స్నానాలు ఆచరించడానికి ఇబ్బందులు పడుతున్నారు.