కాణిపాకం పాలకమండలి ఖరారు !
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ పాలకమండలిని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు మంగళవారం జారీ చేసినట్లు సమాచారం.
కాణిపాకం పాలకమండలి ఖరారు!
కాణిపాకం, న్యూస్‌లైన్: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ పాలకమండలిని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు మంగళవారం జారీ చేసినట్లు సమాచారం. ఆలయానికి ఐదేళ్లుగా పాలక మండలి లేదు. ప్రభుత్వం రెండు సార్లు నియమించినా ఆలయ ఉభయదారులు కోర్టును ఆశ్రయించడంతో సమస్య ఏర్పడింది. దీంతో ఐదేళ్లుగా పాలక మండలి లేకుండానే ఆలయ పాలన సాగింది. ఎట్టకేలకు పాలక మండలిని ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సభ్యులుగా సుబ్రమణ్యంరెడ్డి (మైనగుండ్లపల్లె), చక్రవర్తి (కాణిపాకం), వేణుగోపాల్ (ఉప్పోళ్లూరు), ప్రభాకర్ (దివిటివారిపల్లె), లత (కాణిపాకం), కె.టి.రామరాజ్ (బెంగళూరు), ఈశ్వరయ్య (కడప), పుష్పాహఫ్ (రాయచోటి), సత్యనారాయణ శెట్టి (కలికిరి), సోమశేఖర్ గురుకుల్ (శివాలయం ప్రధాన అర్చకులు) ఎన్నికైనట్లు సమాచారం. వీరు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. తర్వాత సుబ్రమణ్యంరెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే తమకు అవకాశం కల్పించలేదని ఆలయ ఉభయదారులు పాలకమండలి నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.