పని మనిషిపై పలుమార్లు అత్యాచారం
మాదాపూర్ (హైదరాబాద్సిటీ): బ్రతుకుదెరువు కోసం పట్నం వచ్చి పనిమనిషిగా చేరిన ఓ మహిళపై కన్నెశాడో యాజమాని. పనిమనిషిగా చేరి ఆ ఇంట్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అదే అలుసుగా చేసుకుని ఆ ఇంటి యాజమాని ఆమెను లోబర్చుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
మాదాపూర్ ఖనమేట్ ఎమ్మెసార్ నిలయంలోని అపార్టుమెంటులో పని చేస్తున్న పని మనిషిపై ప్లాటు యాజమాని సోమిరెడ్డి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేయడంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.