మాజీ మంత్రి ధర్మానకు ఊరట
శ్రీకాకుళం: కన్నెధార కొండ ప్రాజెక్టు గ్రానైట్ లీజు వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఊరట లభించింది. నియమాల ప్రకారమే మైనింగ్ లీజు దరఖాస్తు చేశారు. అయితే దీనిపై ఈ ఏడాది మే 19న లోకాయుక్త తీర్పులో 10 హెక్టార్ల భూమిని ధర్మానకు అప్పగించాలని కలెక్టరుకు ఆదేశించింది.
కన్నెధార కొండ లీజు విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. లోకాయుక్త కూడా గురువారం తనకు అనుకులంగా తీర్పు ఇచ్చినప్పటికీ గిరిజనల హక్కులు, మనోభావాలు గౌరవించి కాంట్రాక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. లీజు టీడీపీ ప్రభుత్వం గతంలో రద్దు చేసింది. అయితే లోకాయుక్త గురువారం ధర్మానకు అనుకూలంగా తీర్పు నిచ్చింది.