Kannur District
-
చిన్ననాటి గురువు ఇంటికి వెళ్లిన ఉపరాష్ట్రపతి
కన్నూర్(కేరళ): ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ సోమవారం కేరళలో కన్నూర్ జిల్లాలోని పన్నియన్నూర్ గ్రామానికి వెళ్లారు. చిత్తోఢ్‌గఢ్ సైనిక్ స్కూల్లో తన గురువైన రత్న నాయర్‌ను కలుసుకున్నారు. అత్యున్నత స్థాయిలో తమ ఇంటికి వచ్చిన శిష్యుడిని చూసిన ఆమె పొంగిపోయారు. ఇంతకు మించిన గురుదక్షిణ ఇంకేముంటుందంటూ ఆనందించారు. వారిద్దరూ నాటి ఘటనలను గుర్తు తెచ్చుకుంటూ గడిపారు. -
18 నెలలుగా ఇంట్లోనే మృతదేహం.. గంగా జలం చల్లుతూ..!
తిరువనంతపురం: కోమాలోకి వెళ్లిన వ్యక్తి ఎప్పుడు స్పృహలోకి వస్తాడో వైద్యులు సైతం చెప్పలేరు. అందుకు రోజుల నుంచి సంవత్సరాలు పడుతుంది. అలా.. ఓ వ్యక్తి మరణించినప్పటికీ కోమాలో ఉన్నాడని, ఎప్పటికైనా తిరిగి స్పృహలోకి వస్తాడని నమ్మిన ఓ కుటుంబం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేసింది. దాదాపు 18 నెలలుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేసి.. ప్రతిరోజు గంగా జలం చల్లుతున్న ఈ సంఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో జరిగింది. ఏం జరిగింది? ఆదాయ పన్ను విభాగంలో పని చేస్తోన్న విమలేశ్ దీక్షిత్ అనే వ్యక్తి గత ఏడాది ఏప్రిల్‌లో గుండె పోటుతో మరణించాడు. కానీ, అతడు కోమాలో ఉన్నాడని భావించిన కుటుంబం అంత్యక్రియలను నిర్వహించేందుకు అంగీకరించలేదు. ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచేశారు. ఈ క్రమంలోనే కుటుంబానికి అందాల్సిన పింఛన్ దస్త్రాలు ముందుకు కదలటం లేదని ఆదాయ పన్ను శాఖ అధికారులు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. దీంతో పోలీసులతో కలిసి ఆరోగ్య విభాగం అధికారులు రావత్‌పుర్‌లోని దీక్షిత్ ఇంటికి శుక్రవారం వెళ్లారు. ఆయన కోమాలోనే ఉన్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుదీర్ఘ చర్చల తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో దీక్షిత్ బాడీని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. మృతి చెందినట్లు నిర్ధరించారు. మరోవైపు.. మృతదేహాం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. భర్త మరణంతో మానసిక రోగిగా మారిన అతడి భార్య.. ప్రతిరోజు ఉదయం మృతదేహంపై గంగాజలం చల్లుతున్నట్లు చెప్పారు. కోమా నుంచి బయటపడేందుకు గంగా జలం దోహదపడుతుందని ఆమె నమ్ముతున్నారని తెలిపారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం ప్రకారం.. గుండె పోటుతో 2021, ఏప్రిల్ 22న దీక్షిత్ మరణించాడని వెల్లడించారు. చుట్టుపక్కల వారికి సైతం దీక్షిత్ కోమాలోనే ఉన్నాడని చెప్పేవారని, కొన్ని సార్లు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లటం గమనించినట్లు స్థానికులు తెలిపినట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రిసార్టులో 19 ఏళ్ల యువతి హత్య.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు -
Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్ హోస్టెస్
కేరళలో కేవలం పదిహేను వేల మంది ఉండే గిరిజనులు ‘కరింపలనులు’. పోడు వ్యవసాయం, కట్టెబొగ్గు చేసి అమ్మడం వీరి వృత్తి. అలాంటి సమూహం నుంచి ఒకమ్మాయి ‘ఎయిర్‌హోస్టెస్’ కావాలనే కల కంది. కేరళలో అప్పటి వరకూ గిరిజనులు ఎవరూ ఇలాంటి కలను కనలేదు. 12 ఏళ్ల వయసులో కలకంటే 24 ఏళ్ల వయసులో నిజమైంది. పరిచయం చేసుకోండి కేరళ తొలి గిరిజన ఎయిర్‌హోస్టెస్‌ని. కేరళలోని కన్నూరు, కోజికోడ్ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ‘కరింపలనులు’. వీళ్లు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాషను మాట్లాడతారు. అటవీ భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు. లేదంటే అడవిలోని పుల్లల్ని కాల్చి బొగ్గు చేసి అమ్ముతారు. గోపికా గోవింద్ ఇలాంటి సమూహంలో పుట్టింది. అయితే ఈ గిరిజనులకు ఇప్పుడు వ్యవసాయం కోసం అటవీభూమి దొరకడం లేదు. కట్టెలు కాల్చడాన్ని ఫారెస్టు వాళ్లు అడ్డుకుంటూ ఉండటంతో బొగ్గు అమ్మకం కూడా పోయింది. చిన్నప్పుడు అమ్మా నాన్న చేసే ఈ పని చూస్తూ పెరిగిన గోపికా ఇక్కడతో ఆగడమా... అంబరాన్ని తాకడమా అంటే అంబరాన్ని తాకడమే తన లక్ష్యం అని అనుకుంది. డిగ్రీ తర్వాత బిఎస్సీ చదివిన గోపిక ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ కావాలంటే అవసరమైన కోర్సు గురించి వాకబు చేసింది. ప్రయివేటు కాలేజీలలో దాని విలువ లక్షల్లో ఉంది. కూలి పని చేసే తల్లిదండ్రులు ఆ డబ్బు కట్టలేరు. అందుకని ఎం.ఎస్సీ కెమిస్ట్రీ చేరింది. చదువుతున్నదన్న మాటేకాని ఎయిర్ హోస్టెస్ కావడం ఎలా... అని ఆలోచిస్తూనే ఉంది. సరిగ్గా అప్పుడే ఐ.ఏ.టి.ఏ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) వాళ్ల కస్టమర్ సర్వీస్ కోర్సును గవర్నమెంట్ స్కాలర్షిప్ ద్వారా చదవొచ్చని తెలుసుకుంది. ఎస్.టి విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అప్లై చేసింది. స్కాలర్షిప్ మంజూరు అయ్యింది. గోపిక రెక్కలు ఇక ముడుచుకు ఉండిపోలేదు. లక్ష రూపాయల కోర్సు వాయనాడ్‌లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్సును స్కాలర్షిప్ ద్వారా చేరింది గోపిక. చదువు, బస, భోజనం మొత్తం కలిపి లక్ష రూపాయలను ప్రభుత్వమే కట్టింది. మలయాళ మీడియం లో చదువుకున్న గోపిక ఎయిర్ హోస్టెస్‌కు అవసరమైన హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా తర్ఫీదు అయ్యింది. కోర్సు పూర్తి చేసింది. ఒకసారి ఇంటర్వ్యూకు వెళితే సెలెక్ట్ కాలేదు. రెండోసారి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా ఎంపికయ్యింది. విమానం ఎప్పుడూ ఎక్కని గోపిక విమానంలోనే ఇక పై రోజూ చేసే ఉద్యోగం కోసం తిరువనంతపురం నుంచి ముంబైకి ట్రైనింగ్ కోసం వెళ్లింది. అక్టోబర్‌లో ఆమె కూడా యూనిఫామ్ వేసుకుని విమానంలో మనకు తారస పడొచ్చు. ఆమె కలను ఆమె నెరవేర్చుకుంది. ఇక మీ వంతు. 8వ క్లాసు కల గిరిజనులు విమానాన్ని గాల్లో ఎగురుతుంటే చూస్తారు తప్ప ఎక్కలేరు. గోపికా గోవింద్ కూడా చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని ఉత్సాహంగా, వింతగా చూసేది. అందులో ఎక్కడం గురించి ఆలోచించేది. 8వ క్లాసుకు వచ్చినప్పుడు ఒక పేపర్లో ఎర్రటి స్కర్టు, తెల్లటి షర్టు వేసుకున్న ఒక చక్కటి అమ్మాయి గోపికా కంట పడింది. ఎవరా అమ్మాయి అని చూస్తే ‘ఎయిర్ హోస్టస్’ అని తెలిసింది. విమానంలో ఎగురుతూ విధి నిర్వహణ. ఇదేకదా తనకు కావాల్సింది అనుకుంది. కాని ఎవరికైనా చెప్తే నవ్వుతారు. బొగ్గులమ్ముకునే వాళ్ల అమ్మాయికి ఎంత పెద్ద కల అనుకుంటారు. అందుకని సిగ్గుపడింది. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. కాని కల నెరవేర్చుకోవాలన్న కలను మాత్రం రోజురోజుకు ఆశ పోసి పెంచి పెద్ద చేసుకుంది. -
ఒకే ఊరు.. 102 రకాల మామిడి కాయలు.. చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే
మీకు ఎన్ని రకాల మామిడి పండ్లు తెలుసు..? ఐదు, పది, ఇరవై...! ఏకంగా వంద రకాల మామిళ్లను తరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు ఓ గ్రామస్తులు. కేరళలోని కన్నూర్ జిల్లా కన్నపురం వెళ్తే.. మీకు మొత్తానికి మామిడిపండ్ల ఉత్సవమే కళ్ల ముందు నిలబడుతుంది. 207పైగా దేశవాళీ మామిడి రకాలుండగా అందులో 102 రకాలు ఈ ఊళ్లో ఉన్నాయి. కన్నపురంలోని కరువక్కువు ప్రాంతంలో 20 కుటుంబాలు కలిసి.. 300 చదరపు గజాల స్థలంలో 102 రకాల మామిడి చెట్లను పెంచుతున్నారు. స్థానిక పోలీసాఫీసర్ శైజు మచాతి 2016 నుంచి ఈ మామిడి రకాలను సంరక్షించడం మొదలుపెట్టాడు. 200 ఏళ్లనాటి మామిడి చెట్టును కొట్టేస్తున్నారని వ్యవసాయ అధికారి అయిన స్నేహితుడి ద్వారా తెలుసుకుని వెళ్లి, అంటుకట్టి దాన్ని రక్షించాడు. తరువాత 39 వెరైటీలను కలెక్ట్ చేశాడు. ఆయనకు గ్రామస్తుల సాయం తోడైంది.. మొత్తానికి 2020 కళ్లా 102 రకాలను సేకరించి, పెంచగలిగారు. ఏటా మే మొదటి ఆదివారం కన్నపురంలో ‘మ్యాంగో ఫెస్ట్’నిర్వహిస్తారు. జూలై 22 వరల్డ్ మ్యాంగో డే సందర్భంగా.. కేరళ బయోడైవర్సిటీ బోర్డు కరువక్కవును ‘దేశీయ మామిడి వారసత్వ ప్రాంతం’గా ప్రకటించింది. -
Moustache Woman: నా మీసం నాకెంతో ఇష్టం.. అవే నాకు అందం!
తిరువనంతపురం: ముఖంపై అవాంఛిత రోమాలుంటేనే అసౌకర్యంగా ఫీలవుతుంటారు. వాటిని ఎప్పటికప్పుడు తొలగించేస్తుంటారు. మహిళలు నలుగురిలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటారు. కానీ, కేరళలోని కన్నూర్‌కు చెందిన శైజ అనే మహిళ తాను మాత్రం అందుకు భిన్నం అంటోంది. తన పైపెదవి పైభాగంలో అవాంఛిత రోమాలు పెరిగి.. కోరమీసంలా మారిపోయింది. అయితే.. వాటిని తొలగించలేనంటోంది శైజ. మీసం లేకుండా జీవితాన్ని ఊహించలేనంటూ సమాధానమిస్తోంది. ప్రస్తుతం మీసంతో ఉన్న శైజ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేరళ కన్నూర్‌లోని కుతుపరంబకు చెందిన 35 ఏళ్ల శైజ.. తన మీసాన్ని ఎంతో ఇష్టపడుతున్నట్లు పేర్కొంటోంది. తన వాట్సాప్ స్టేటస్లలోనూ తన కోరమీసం ఫోటోలతో అలరిస్తోంది. శైజ తన ఐబ్రోస్‌ను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయిస్తున్నా.. పైపెదవి పైభాగంలో పెరిగిన మీసాన్ని మాత్రం తొలగించలేదు. ఐదేళ్ల క్రితం పైపెదవి పైభాగంలో అవాంఛిత రోమాలు పెరిగి నల్లగా దట్టంగా మారాయి. అయితే.. వాటిని తొలగించకుండా అలాగే కొనసాగించాలని నిర్ణయించుకుంది శైజ. ‘మీసం లేకుండా ఉండటాన్ని ఊహించుకోలేను. కరోనా మహమ్మారి వచ్చినప్పటికీ నేను మాస్క్ పెట్టుకునేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే అది నా ముఖాన్ని కప్పివేస్తుంది. మీసం ఉన్నందుకు అందంగా లేనని నేనెప్పుడూ బాధపడలేదు. నాకు నచ్చిందే చేస్తాను.’ అని ఓ వార్తా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీసక్కరి పేరుతో.. మీసంతో ఉన్న శైజకు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు మద్దతుగా నిలిచారు. ఆమె కూతురు సైతం మీసాన్ని ఎంతో ఇష్టపడుతోంది. తనపై కొందరు జోకులు వేస్తున్నారని, అలాంటి వాటిని తాను పట్టించుకోనని చెబుతున్నారు శైజ. కొందరు తనకు మీసక్కరి(మీసంతో ఉన్న మహిళ) అని పేరుపెట్టారని, అందుకే అదే పేరుతో సోషల్ మీడియాలో తన ఖాతాలు క్రియోట్ చేసినట్లు చెప్పారు శైజ. View this post on Instagram A post shared by മീശക്കാരി മീശക്കാരി (@meesakkari_) ఇదీ చదవండి: ఇంటికి రూ.3వేల కోట్లు విద్యుత్తు బిల్లు.. షాక్‌తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి! -
ఐసిస్ వద్దు బాబోయ్.. వెనక్కొచ్చేస్తా..!!
న్యూఢిల్లీ : అమెరికా సేనలు ఉక్కుపాదం మోపడంతో ఐసిస్ ఉగ్రవాదంవైపు ఆకర్షితులైన యువత తిరుగుముఖం పడుతోంది. తిండీ తిప్పలు కొరవడిన దారుణ పరిస్థితుల నుంచి బయటపడేందుకు యువత యత్నిస్తోంది. తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు స్వదేశానికి తిరిగొస్తానని కుటుంబీకులకు మొరపెట్టుకున్నాడు. వివరాలు.. ఇస్లాం రాజ్యస్థాపన భ్రమలతో ఐసిస్‌లో చేరేందుకు కేరళ నుంచి 12 మంది యువకులు 2016లో పయనమయ్యారు. వారంతా అఫ్గాన్ చేరుకోగా.. ఫిరోజ్ అలియాస్ ఫిరోజ్‌ఖాన్ (25) మాత్రం అక్రమంగా సిరియాలో చొరబడ్డాడు. అయితే, వారి అంచనాలు తల్లక్రిందులయ్యాయి. తీవ్రవాద అంతానికి అగ్రరాజ్యం అమెరికా గట్టి చర్యలు తీసుకోవడంతో ఐసిస్ సంక్షోభంలో పడింది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దారిద్ర్యంలోకి ఆ ఉగ్రసంస్థ చేరింది. దాంతో అక్కడే ఉంటే ప్రాణాలు నిలుపుకోవడం కష్టమనుకున్న ఫిరోజ్‌ఖాన్ గతనెలలో ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి తిరిగొస్తానని, పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. అక్కడే మలేషియా అమ్మాయితో తనకు వివాహం చేశారని, తర్వాత ఆమె తనను విడిచి వెళ్లిపోయిందని తల్లితో ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, అతను, ఎప్పుడు ఎక్కడ లొంగిపోతాననే విషయం వెల్లడించలేదని తెలిసింది. ఇక ఫిరోజ్ ఫోన్‌కాల్ గురించి తెలిసిందని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ‘కుంటుంబ సభ్యులతో ఫిరోజ్ టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. గతంతో బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి వారిని ఐసిస్‌లో చేర్పించేందుకు యత్నించాడనే సమాచారముంది. ఐసిస్‌లో చేరండని కాసర్గాడ్ యువతను ప్రలోభపెట్టిన కేసులో అతను కూడా నిందితుడు’ అని సెక్యూరిటీ ఉన్నతాధికారులు తెలిపారు. కన్నూర్ జిల్లా నుంచి 35 మంది వరకు ఐసిస్ బాట పట్టారని, వారిలో చాలామంది అమెరికా సేనల దాడిలో ప్రాణాలు విడిచి ఉండొచ్చని అన్నారు. కన్నూర్ జిల్లాలోని కూడలి ప్రాంతానికి చెందిన షాజహాన్ (32) టర్కీ మీదుగా సిరియా వెళ్తూ పట్టుబడ్డాడని భద్రతా అధికారులు వెల్లడించారు. -
అట్టుడుకుతున్న కన్నూర్
కన్నూర్/తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళలో రాజకీయంగా అత్యంత సున్నితమైన కన్నూర్‌తోపాటు పతనంథిట్ట, కోజికోడ్ జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, సీపీఎం నేతల ఇళ్లు, ఆస్తులపై బాంబు దాడులు జరిగాయి. శబరిమల ఆలయంలోకి 2వ తేదీన 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళల ప్రవేశం అనంతరం రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని సీఎం విజయన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. పలుచోట్ల బాంబు దాడులు సీపీఎం ఎమ్మెల్యే ఏఎన్ షంషీర్‌కు చెందిన మడపీడికయిల్‌లోని ఇంటిపై, వడియిల్ పీడికియలోని బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు వి. మురళీధరన్ పూర్వీకుల నివాసం, తలస్సేరిలోని సీపీఎం నేత పి.శశి ఇంటిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పొరుగునే ఉన్న కోజికోడ్ జిల్లా పెరంబ్రాతోపాటు శబరిమల ఆలయం ఉన్న పతనంథిట్ట జిల్లా మలప్పురం, ఆదూర్‌లలో శుక్రవారం అర్థరాత్రి, శనివారం వేకువజామున బీజేపీ, సీపీఎం కార్యకర్తలు పరస్పరం దాడులు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అల్లర్లకు సంబంధించి 1,700 మందిని, కన్నూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి 260 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శబరిమల అంశాన్ని సున్నితంగా పరిష్కరించడానికి బదులు సీపీఎం ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అన్ని వర్గాల వారు చట్టాన్ని గౌరవించాలన్నదే తమ అభిమతమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రతినిధి ఫర్హాన్ హక్ అన్నారు. శబరిమల వివాదం కారణంగా కేరళలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుం టున్నందున అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం తమ పౌరులను హెచ్చరించింది. -
అమ్మానాన్న పొమ్మన్నారు... కలెక్టర్ ఆదుకున్నారు!
తిరువనంతపురం: హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడం.. ఆ తర్వాత వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతి(20) నెమ్మదిగా కోలుకుంటోంది. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో గత నెలలో చోటచేసుకుంది. కన్నవాళ్లు కాదన్నా... జిల్లా కలెక్టర్ పి బాలకిరణ్ ఆమెకు అండగా నిలిచారు. ఆ యువతి(20) తిరిగి తన చదువును కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ యువతిని తిరిగి కాలేజీలో జాయిన్ చేసి ఆమెకు మనోధైర్యాన్ని అందించారు. తనకు అన్ని విధాలా సాయం చేసిన కలెక్టర్ కు బాధిత యువతి కృతజ్ఞతలు తెలిపింది. కలెక్టర్ బుధవారం కాలేజీ విద్యార్థులు, ఆమె తల్లిదండ్రులకు హెచ్ఐవీపై అవగాహనా కల్పించడంతో పాటు యువతికి సహకరించాలని కౌన్సెలింగ్ నిర్వహించారు. అసలు విషయం ఇది.. తనకు సోకిన వ్యాధి గురించిన విషయాన్ని ఇటీవలే ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థిని బయటపెట్టింది. ఆమెతో ఉండేందుకు తోటి విద్యార్థులు నిరాకరించారు. తోటి విద్యార్థినులు రూమ్స్ ఖాళీ చేయడం మొదలెట్టారు. దీంతో ఆమెను ఆ కాలేజీ యాజమాన్యం అక్కడ నుంచి పంపేసింది. హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి వెళ్లగొట్టారు. కాలేజీ నుంచి పంపించిన విషయాన్ని ప్రిన్సిపాల్ పీఏ జునైద్ కూడా అంగీకరించారు. అయితే ఆ విద్యార్థిని ఇక ఏ గత్యంతరం లేక కన్నవారి వద్దకు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు ఆదరణ కరువైంది. తనకు ఎవరూ అండగా లేరని మనస్తాపం చెందిన యువతి గత నెలలో ఆత్మహత్యకు యత్నించింది. చివరకు ఎలాగోలాగ ప్రాణాలతో బయటపడింది.