Kanpur Dehat District
-
30 ఏళ్ల మహిళతో తండ్రి సహాజీవనం.. తట్టుకోలేక కొడుకుల కిరాతకం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోరం వెలుగుచూసింది. తండ్రి మరో మహిళతో సహజీవనం చేయడాన్ని తట్టుకోలేని కొడుకు వారి ఇద్దరిని అంతమొందించాలని పథకం వేశాడు. మధ్యలో తాత అడ్డు రావడంతో ముగ్గురిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో తాత, సహజీవనం చేస్తున్న మహిళ మృత్యువాత పడగా.. తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం కాన్పూర్ దేహత్ జిల్లాలో గురువారం ఉదయం జరిగింది.. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. రామ్ ప్రకాశ్ ద్వివేది(83), అతని కుమారుడు విమల్(63), అతని భాగస్వామి ఖుష్బు(30)కలిసి అమ్రోదా పట్టణంలో నివసిస్తున్నారు. విమల్ 30 ఏళ్ల మహిళతో కలిసి సహజీవనం విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విమల్ కొడుకు లలిత్(42), సోదరుడు అక్షత్(18) గురువారం ఉదయం తండ్రి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. తాత, తండ్రి, మహిళను విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం రామ్ ప్రకాశ్, ఖుష్బును కత్తితో పొడిచి చంపారు. నిందితుల దాడి నుంచి తప్పించుకొని విమల్ ఇంటి నుంచి బయటకు పరుగెత్తాడు. ఈ విషయాన్ని గమనించిన ఇంటి పక్కన ఉండే మున్నా వెంటనే పక్క ఇంట్లో ఉంటున్న విమల్ అన్న కమల్‌కు సమాచారం అందించాడు. అతడువిమల్‌ను జిల్లా ఆసుపత్రికి అటు నుంచి కాన్పూర్‌లోని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్షత్ లలిత్‌లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 30 ఏళ్ల ఖుష్బుతో తండ్రి సంబంధపై ఇద్దరు కుమారులు అసంతృప్తిగా ఉన్నారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ పాండే తెలిపారు. విచారణలో రామ్‌ప్రకాష్, ఖుష్బులను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు. -
అమానుషం: మహిళను ఈడ్చి కొట్టి మీద కూర్చున్న ఎస్సై
ఒక మహిళపై అమానుషంగా దాడి చేశారనే విమర్శలు ఉత్తర ప్రదేశ్ పోలీసుల్ని చుట్టుముట్టాయి. కాన్పూర్ డెహత్ జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి.. ఓ వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు అతని భార్యపై దాడి చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాన్పూర్ డెహత్(దెహత్) జిల్లా దుర్గాదాస్‌పూర్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తన భర్త అక్రమంగా అరెస్ట్ చేశారని, వదిలిపెట్టాలంటే డబ్బు ఇవ్వాలని భోగిన్‌పూర్ ఎస్సై మహేంద్ర పటేల్ డిమాండ్ చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇవ్వనని చెప్పడంతో తనను లాగేసి నేల మీద పడేసి కొట్టాడని, మీద కూర్చుని ముఖం మీద దాడి చేశాడని, గ్రామస్తుల జోక్యం చేసుకోవడంతో తను వదిలేశాడని వాపోయిందామె. అయితే ఆ సమయంలో స్నేహితులతో శివం యాదవ్ జూదం ఆడుతున్నాడని. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అతని భార్య ఆర్తి, తల్లి తమను అడ్డుకోవాలని ప్రయత్నించారని, ఈ క్రమంలో వాళ్లే తన బృందంపై దాడి చేశారని ఎస్సై పటేల్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కాన్పూర్ ఎస్పీ చౌదరి స్పందిస్తూ.. శివం పారిపోయేందుకు సాయం చేసేందుకే అతని భార్య తనను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారని పటేల్ భావించాడని, అందుకే అలా ప్రవర్తించాడని తెలిపారు. పటేల్‌ను భోగిన్‌పూర్ విధుల నుంచి తప్పించామని, ఘటనపై దర్యాప్తు చేయించి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాన్పూర్ ఎస్పీ చౌదరి తెలిపారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ ఈ ఘటనపై రాజకీయ విమర్శలు చేస్తోంది. -
విద్యార్థినిపై టీచర్ అకృత్యం
లక్నో: ఓ ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా విద్యార్ధినిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పుర్ దేహాట్ జిల్లాకు చెందిన బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శైలేంద్ర రాజ్‌పుత్ గత కొద్ది కాలంగా బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో యాజమాన్యం శైలేంద్రను మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అవమానంపై బదుల తీర్చుకోవాలని భావించిన అతడు... బాలిక గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ అనురాగ్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు బాలికపై మూడు సార్లు కాల్పులు జరిపాడని.. అందులో ఓ బుల్లెట్ మెడకి తగలడంతో తను కుప్పకూలిపోయిందని తెలిపారు. గాయపడిన ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారని, వైద్యులు చికిత్స చేస్తుండగా ఆమె మరణించిందని వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యలు పాఠశాలపై దాడి చేసి.. రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకునే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. -
దీపావళి, హోళీ ఒకేసారి!
♦ కోవింద్ గెలుపుతో అభిమానుల సంబరాలు ♦ పండుగ శోభను సంతరించుకున్న రామ్‌నాథ్ నివాసాలు ♦ టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్న కళ్యాణ్పూర్ ప్రజలు కాన్పూర్/న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికైన వెంటనే ఆయన స్వస్థలం కాన్పూర్ దెహత్ జిల్లాలోని స్వగ్రామం, ఢిల్లీ, కాన్పూర్ నగరాల్లోని నివా సాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ శివార్లలో ఉన్న కళ్యాణ్‌పూర్‌లోని కోవింద్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అక్కడి మహర్షి దయానంద్ విహార్ కాలనీ ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, మిఠా యిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకు న్నారు. ‘మాకు దసరా, దీపావళి, హోలీ పండుగలు ఒకేసారి వచ్చినట్లు ఉంది’ అని ఓ స్థానికుడు ఉత్సాహంగా చెప్పాడు. ‘ఓట్ల లెక్కింపు మొదలవ్వక ముందే మేం సంబరా లు ప్రారంభించాం. కోవింద్ గెలుస్తారన్న విషయం ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిననాడే మాకు తెలుసు. మా వార్డులో నివసించే వ్యక్తి రాష్ట్రపతి అని తలచుకుంటేనే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతోంది’ అని స్థానిక కార్పొరేటర్ అన్నారు. కాన్పూర్ నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ అధికారులు వేడుకలు నిర్వహించారు. శుభా కాంక్షలు చెప్పేందుకు ఉదయంనుంచే కళ్యాణ్ పూర్లోని ఇంటి వద్దకు జనాలు చేరుకోవడం ప్రారంభించారు. ఫలితాలను అధికారికంగా ప్రకటించిన వెంటనే ఆ ప్రాంత మంతా టపాసుల ధ్వనులతో మార్మోగింది. సరిత అనే మహిళ మాట్లాడుతూ ‘కోవింద్ కుటుంబంతో మాకు మంచి బంధం ఉంది. జీవితంలో ముందుకు సాగేలా ఆయన ఎన్నోసార్లు మాకు ప్రేరణనిచ్చారు’ అని చెప్పారు. కోవింద్ చదువుకున్న డీఏవీ కళాశాల ప్రిన్సిపాల్ అమిత్ మాట్లాడుతూ ‘మా పూర్వ విద్యార్థి ఒకరు ఇప్పుడు భారత రాజ్యాంగ అత్యున్నత పదవిని అధిష్టించనుం డటం మాకు గర్వంగా ఉంది. 2019లో జరిగే మా కాలేజీ శతజయంతి ఉత్సవాలకు ఆయనను ఆహ్వానిస్తాం’ అని అన్నారు. అటు లక్నోకు 160 కి.మీ దూరం లోని కోవింద్ స్వస్థలం కాన్పూర్ దెహత్ జిల్లాలోని ఝింఝక్ తాలూకా పరౌంఖ్ గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. శుభాకాం క్షలు చెప్పేందుకు వచ్చిన వారందరికీ కోవింద్ కుటుంబసభ్యులు రంగులుపూస్తూ సంబరా లు జరుపుకోవడంతో పాటు మిఠాయిలను పంచారు. రామ్‌నాథ్ సోదరుడి కూతురు హేమలతా కోవింద్ మాట్లాడుతూ ‘ఆయన భారీ ఆధిక్యంతో గెలుస్తారని మాకు ముందే తెలుసు. ఈ రోజు ఫలితాలు వెలువడ్డాక మాకు గర్వంగా ఉంది. ఇప్పుడు మా ఆనందా నికి అవధులే లేవు. మా గ్రామమంతా ఇవ్వాళ హోలీ, దీపావళి జరుపుకుంటోంది. సాయంత్రం టపాసులు పేలుస్తాం’ అంటూ సంతోషంతో ఉప్పొంగిపోయారు. ప్రమాణ స్వీకార వేడుక కోసం ఢిల్లీ రావాల్సిందిగా జూలై 18నే కోవింద్ తమను ఆహ్వానించారనీ, రైలు టిక్కెట్లను కూడా రిజర్వ్ చేసుకున్నామని హేమలత వెల్లడించారు. అటు లుటియెన్స్ ఢిల్లీలోని 10 అక్బర్ రోడ్డులో ఉన్న కోవింద్ నివాసంలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఇది కేంద్ర మంత్రి మహేశ్ శర్మ అధికారిక నివాసం రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసినప్పటి నుంచి కోవింద్ ఇక్కడే ఉంటున్నారు. బంగ్లా ప్రధాన ద్వారం వద్ద రంగురంగుల పూలతో అలంకరించి రామ్‌నాథ్‌కు ప్రత్యేక స్వాగతం పలికారు.