త్యాగానికీ, ఆత్మ గౌరవానికీ మారు పేరు
ఈ దేశంలో కులవ్యవస్థపై పోరాటం చేసిన మహా పురుషులు, నాయకులు తమ జీవిత కాలంలో ఏదో ఒక సంద ర్భంలో అవమానాలకు, వివక్షకు గురైన వారే. కొలియలకు, శాక్య వంశస్తులకు మధ్య నీటి యుద్ధం అనివార్యమై క్షత్రి యుడైన సిద్ధార్థుడు యుద్ధాన్ని వ్యతిరేకిం చినప్పుడు క్షత్రియ ధర్మమైన రాజ్యపా లనకు అనర్హుడని సొంత సమాజం నుం చి అవమానానికి గురయ్యాడు. ఆ అవమానమే ప్రపంచంలో తొలి సామాజిక విప్లవకారుడి ఆవిర్భావానికి, గౌతమ బుద్ధుడు ఉద్భవిం చడానికి కారణమైనది. బ్రాహ్మణ స్నేహితుడి పెళ్లి ఊరేగింపులో జ్యోతిరావు ఫూలేకి జరిగిన అవమానం... ఆధునిక సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలేను, తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రి బాయిని ఈ దేశానికీ అందించింది.
శూద్ర రాజర్షులైన శివాజీ, సాహుజీలకు పట్టాభిషేకం సమయంలో జరిగిన అవమా నాలు- వారిని ఛత్రపతులుగా తీర్చిదిద్దాయి. అఖిల భారత జాతీ య కాంగ్రెస్లో జరిగిన అవమానంతో- పెరియార్ రామస్వామి ఆత్మగౌరవ, హేతు, నాస్తికవాద పునాదులు బలపడ్డాయి. గుడిలోకి అడుగు పెట్టనివ్వని వివక్ష- కేరళలో అయ్యంకాళి, నారాయణ గురువులను పుట్టించి ఆ రాష్ర్ట పాలనలో నేటికి మనుధర్మ ఛాయ లు రాకుండా చేసింది. బాల్యం నుంచి భీమ్రావుకి జరిగిన అవ మానాలు, మానసిక క్షోభ- ప్రపంచానికి ఒక మేధావిని, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన బాబా సాహెబ్ అంబేద్కర్ని అందించి కోటానుకోట్ల బడుగు, బలహీన, దళిత, మైనారిటీలతో పాటు అన్ని కులాల్లోని స్త్రీలు, కార్మిక, కర్షక లోకా నికి సౌకర్యవంతమైన జీవనానికి అవకాశాన్ని కల్పించాయి.
వీటన్నింటికీ భిన్నంగా పంజాబ్లోని సైనిక నేపథ్య చమార్ కుటుంబంలో పుట్టి, కుల వివక్షకు ఏ మాత్రం గురికాని ఓ వ్యక్తి, పుణెలోని రక్షణ సం స్థలో ఉద్యోగిగా చేరాక అక్కడి ఉద్యోగ సంఘ నాయకుడు ఇచ్చిన అంబేద్కర్ రాసిన ‘కులనిర్మూ లన’ చదివి తెలుసుకున్న మనువాద మర్మం - భారతదేశంలో అంబేద్కర్ పునరుజ్జీవనానికి నాం ది పలికి, భారత రాజకీయాల దశ, దిశను మార్చే శక్తి కలిగిన కాన్షీరామ్కి పురుడుపోసింది.
కుల వివక్ష గురించి ఏ మాత్రం తెలియని ఒక మాదిగ వ్యక్తికి ఒక చిన్న పుస్తకం, ప్రజాస్వామ్య భారతాన్ని ప్రభావి తం చేయగల మహాశక్తిని అందించింది. కాన్షీరామ్ తన తల్లికి రాసి న 24 పేజీల ఉత్తరంలో ఇకపై ఎలాంటి కుటుంబ శుభ, అశుభకా ర్యాలకు రానని, పెళ్లి చేసుకోనని చెప్పి కోట్లాది దయనీయ బహు జన జీవితాలకై ఉద్యోగాన్ని సైతం వదలి అంబేద్కర్ ఉద్యమానికి ఊపిరి పోశాడు. 1956, మార్చి, 18 నాడు ఆగ్రాలో జరిగిన షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో రిజర్వే షన్ల ఫలితాలు అనుభవిస్తున్న ఉద్యోగులు మాట్లాడిన స్వార్థపూరిత మాటలతో మానసిక వేదనకు గురై, అనారోగ్యంతో మరణించిన బాబాసాహెబ్ ఉద్యమానికి, అదే ఉద్యోగస్తుల టైమ్, టాలెంట్, ట్రెజర్ ద్వారా కాన్షీరామ్ ప్రాణం పోశాడు. నేటి దళిత నాయకులు, వివిధ కుల సంఘ నేతల వలె కాన్షీరామ్ ఏనాడూ అగ్ర కులాలను నిందించడమే పనిగా పెట్ట్టుకోలేదు, ఇతర కులాలను ద్వేషించ లేదు, సొంత ఫిలాసఫీ చెప్పలేదు. గాంధీ- అంబేద్కర్ల అయిష్ట పూనా ఒడంబడికలోని రహస్య కోణాలను బహిర్గ తం చేసి ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో అంబేద్కర్ని బ్లాక్ మెయిల్ చేసిన కుట్రలను ప్రధా న ఎజెండాగా అందించి గెలుపొందిన యోధుడు కాన్షీరామ్. ఫూలే ‘గులాంగిరి’, అంబేద్కర్ ‘కులని ర్మూలన’, కాన్షీరామ్ ‘చెంచాయుగం’ బహుజన జాతులకు కనువిప్పు కలిగించే పుస్తకాలు.
ప్రతి కులంలోని వ్యక్తులు ఎక్కడో ఒకచోట మానసిక, శారీరక సంఘర్షణలకు గురవక తప్ప దు. కులనిర్మూలనకై సాగాల్సిన ఉద్యమాలు కులం బలపడేటట్లు తయారై, కులానికో అవధూత తయారై, సవాలక్ష అవలక్షణాలతో అంబేద్కర్కి అపప్రథ తెస్తూ ఉద్య మాన్ని ప్రేమిం చే ఉద్యోగులను మోసం చేస్తున్నాయి.
రాబోయే తరాలు వారిని చరిత్ర పుటల్లోంచి తొలగిస్తాయి. ఆత్మగౌరవం అనేది ప్రతి వ్యక్తి విజయానికి భూమిక. అదిలేని ఏ పోరాటం చరిత్రలో విజయం సాధించిన దాఖలాలు లేవు, నిరంతరం బ్రాహ్మణులను, అగ్రవర్ణా లను నిందించడం మాని ఇతర కులాలను ప్రేమించి ఆత్మగౌర వంతో జీవిస్తూ, లక్ష్యసాధనలో వెన్నుచూపని ధైర్యం అలవర్చు కున్న వారే కాన్షీరామ్ అసలైన వారసులు. కాబట్టి ‘పే బ్యాక్ టు సొసైటీ’లో స్వచ్ఛందంగా పాల్గొని. కులరహిత సమాజాన్ని నిర్మి ద్దాం. అదే కాన్షీరామ్కి మనమిచ్చే నిజమైన నివాళి.
(నేడు కాన్షీరామ్ 81వ జయంతి సందర్భంగా)
రాములు, ప్రెసిడెంట్, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్
ఫోన్: 8886-612415
- రాములు
బహుజన రచయితల వేదిక ఆవిర్భావ సదస్సు
బహుజనుల ఆరాధ్య నేత కాన్షీరాం 81వ జయంతి సందర్భంగా బహుజన రచయితల వేదిక ఆంధ్రప్రదేశ్ సదస్సు నేడు ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరుగనుం ది. దళిత ఉద్యమం, సాహిత్యం ఉవ్వెత్తున ఎగిసిపడే తరుణం లోనే ఉత్తరప్రదేశ్లో మాయావతిని సీఎం చేయడం ద్వారా కాన్షీరాం భారత పీడిత కులాలకు ఒక సరికొత్త కలను సాక్షా త్కారం చేశారు. ఆ ఊపు అప్పట్లో ఆంధ్రాలో కూడా బాగా ప్రచారమైనప్పటికీ, అంబేద్కర్ వాదాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేసిన శక్తులు నీరసించిపోయి బహుజన ఉద్యమ కాడిని వదిలేశాయి. అంబేద్కర్ మార్గం, కాన్షీరాం రాజకీయ చతురత, ఫూలే సంస్కరణాత్మక కార్యాచరణలను జెండాగా, ఎజెండాగా స్వీకరిస్తూ బహుజన రచయితల వేదిక పురుడు పోసుకుంటున్నది. ఆయా కులాల అస్తిత్వ విశిష్టతను పరిరక్షిం చుకుంటూనే, అణగారిన కులాల అస్తిత్వ రాజకీయాలను పున రుత్తేజం చేయడం బహుజన రచయితల వేదిక కర్తవ్యం. పార్ల మెంటరీ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అన్ని రంగాలను బహుజన విముక్తి దృష్టి కోణంతో విశ్లేషిస్తూ సృజనరంగంలోకి వేదిక అడుగుపెడుతుంది. బహుజనులను రాజ్యాధికారం వైపు తీసుకువెళ్లటం లక్ష్యంగా ప్రయాణించే బహుజన సాహితీ వేత్త లకు, కవులు, రచయితలు, మేధావులకు ఇదే మా స్వాగతం.
(నేడు బహుజన రచయితల వేదిక ఆవిర్భావ సదస్సు)
డాక్టర్ కాకాని సుధాకర్, కన్వీనర్ మొబైల్: 9440184788