Kanumoori Bapi Raju
-
శ్రీవారి సేవలో వెంకయ్యనాయుడు
తిరుమల, న్యూస్‌లైన్: తిరుమల శ్రీవారిని శని వారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దర్శిం చుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా వైకుం ఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లా రు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నా రు. అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు. వీరికి టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయక మండపంలో శ్రీవారి లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. వీరితో పాటు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఉన్నారు. టీడీపీ నేత అంబికా కృష్ణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
వైభవంగా హనుమజ్జయంతి
జపాలిలో కిట కిటలాడిన భక్తులు తిరుమల, న్యూస్‌లైన్: తిరుమలలో హనుమాన్ జయంతి వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది హనుమజ్జయంతిని తిరుమల పాపవినాశనం మార్గంలోని జపాలిలో వేడుకగా నిర్వహించడం అనవాయితీ. శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజుకు పట్టువస్త్రాలను సమర్పించారు. వేకువజాము నుంచే ఆలయం వద్ద భక్తులు పోటెత్తారు. ఆంజనేయస్వామి మాలను ధరించి దీక్ష చేప్పటిన భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. జై సీతారామ్ అంటూ నామస్మరణ చేస్తూ ఆంజనీపుత్రుని సేవలో తరించారు. అంతకుముందు హథీరామ్ జీ మఠం మహంత్ అర్జున్‌దాస్ ఆధ్వర్యంలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీఆంజనేయస్వామిని ప్రత్యేక పుష్పాలను అలంకరించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అభిషేకాలను, ఇతర పూజలను నిర్వహించారు. అలాగే శ్రీవారి ఆల యం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామికి ఉదయం 9గంటలకు ఆభిషేకాన్ని నిర్వహించారు. టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అర్చకులు పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనం, పాలుతో అభిషేకాన్ని నిర్వహించారు. మొదటి ఘాట్‌రోడ్డు ఏడోమైలు వద్దనున్న భారీ ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరణాగత ప్రపత్తికి, దాసభక్తికి ప్రతీక హనుమంతుడు... దాస భక్తికి ప్రతీకైన ఆంజనేయస్వామి భక్తాగ్రేసురుల్లో అత్యంత ఉత్కృష్ణమైనవారని టీటీడీ చైర్మన్ బాపిరాజు పేర్కొన్నారు. టీటీడీ తరుపున ఆంజనేయస్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంపూర్ణ శరణాగతే జీవన పరమావధిగా చేసుకున్న భక్తాగ్రగణ్యుడు హనుమంతుడన్నారు. జీవితాంతం రామనాస్మరణే ధ్యేయంగా మలచుకుని నేటికీ చిరంజీవిగానే ఉంటూ తన భక్తుల కోరికలను తీరుస్తున్న కల్పతరువుగా ఆంజనేయస్వామి ప్రసిద్ధిగాంచినట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం జపాలిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ జపాలీ తీర్ధానికి చేరుకుని హనుమంతుడిని దర్శించుకుంటున్నారని చెప్పారు. -
హరినామ సంకీర్తనతో ప్రశాంతత
=టీటీడీ చైర్మన్ బాపిరాజు =తిరుచానూరులో శోభాయాత్ర తిరుచానూరు, న్యూస్‌లైన్: కలియుగంలో హరి నామ సంకీర్తనతోనే ప్రశాంతత లభిస్తుందని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. సోమవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి శని వారం సాయంత్రం తిరుచానూరులో భజనమండళ్ల శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైం ది. తిరుచానూరు అమ్మవారి ఆలయం నుంచి శ్రీనివాస కల్యాణమండపం వరకు భజన బృం దాల కోలాటాలు, భజనలతో శోభాయాత్ర సాగింది. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్రను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 3,500 మంది భజనమండళ్ల సభ్యులు మెట్లోత్సవంలో పాల్గొంటార ని తెలిపారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పీఆర్.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణమండపంలో శనివారం ఉద యం నుంచి భజనలు, సంకీర్తనల ఆలాపన, హరిదాసుల ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిం చినట్టు చెప్పారు. సోమవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహించి, భజన మండళ్ల సభ్యుల తో సంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటామన్నారు. స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
‘జన’సరోవరం
=పంచమి తీర్థానికి పోటెత్తిన భక్తులు =నేత్రపర్వంగా చక్రస్నానం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమితీర్థ (చక్రస్నానం) మహోత్సవం శనివారం అమ్మవారి పుష్కరిణిలో నేత్రపర్వంగా జరిగింది. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి స్వయంగా తన కుంతాయుధంతో తవ్విన పద్మసరోవరం(పుష్కరిణి)లో కార్తీక మాసం, శుక్లపక్ష పంచమి తిథి, ఉత్తరాషాడ నక్షత్రం రోజున స్వర్ణకమలంలో పద్మావతీదేవిగా అమ్మవారు అవతరిం చారు. ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. తిరుచానూరు, న్యూస్‌లైన్: అమ్మవారు ఆవిర్భవించిన పద్మసరోవరంలో ప్రతి ఏటా నిర్వహించే పంచమితీర్థం రోజున స్నానమాచరిస్తే సకల పాపాలు హరిం చుకుపోయి కోటిజన్మల పుణ్యఫలం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఇందులో భాగంగా పద్మావతీ అమ్మవారిని శనివారం వేకువజాము 3.30 గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారికి పల్లకీ వాహన సేవ జరిగింది. అమ్మవారు, చక్రతాళ్వార్లను సన్నిధి నుంచి వేంచేపుగా పుష్కరిణిలోని పంచమితీర్థం మం డపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. తిరుమల నుంచి వచ్చిన సారెతో ఉదయం 10.30 గంటల నుంచి అమ్మవారు, చక్రతాళ్వార్లకు నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వైభవంగా చక్రస్నానం స్నపన తిరుమంజనం అనంతరం చక్రతాళ్వార్లను పుష్కరిణిలోకి తీసుకొచ్చి, 12.12 గంటలకు ధనుర్లగ్నంలో చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పద్మసరోవరంలో పవిత్ర స్నానమాచరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కనుమూరిబాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో గోపాలకృష్ణ, ఏఈవో నాగరత్న పాల్గొన్నారు. -
కల్పవృక్షమెక్కి కరుణించిన తల్లి
తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం కల్పవృక్షంపై, రాత్రి హనుమంతునిపై అమ్మవారు భక్తులను కటాక్షించారు. వేలాదిమంది భక్తులు, వందలాదిగా కళాకారులు అమ్మవారి సేవలో తరించారు. -
కల్పవృక్షమెక్కి..కరుణించిన తల్లి
తిరుచానూరు, న్యూస్‌లైన్: పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన సోమవారం ఉదయం రాజగోపాలుని అలంకరణలో అమ్మవారు కోర్కెలను తీర్చే కల్పవృక్ష వాహనంపై తిరువీధు ల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు అమ్మవారిని ఆలయంలోని అద్దాలమండపం నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి అక్కడే సిద్ధంగా ఉంచిన కల్పవృక్షవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారిని పట్టుపీతాంబర, స్వర్ణాభరణాలతో పాటు ఎడమ చేతిలో రాజదండం, కుడి చేతిలో చర్నాకోల చేతబట్టి గోవుల ను పాలించే రాజగోపాలునిగా అలంకరించారు. అనంతరం 8గంటలకు జియ్యర్ల ప్రబంధ పారాయణం, మంగళ వాయిద్యాలు, చిన్నారుల కోలాటం, దాససాహితీ భజన బృందం, కళాకారుల నృత్య ప్రదర్శన, భక్తుల గోవింద నామ స్మరణ నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి అమ్మవారు హనుమంత వాహనంపై రాముని అవతారంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వాహనసేవల్లో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో నాగరత్న పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి మంగళవారం వసంతోత్సవం నిర్వహించనున్నారు. -
ఆకట్టుకుంటున్న ఫలపుష్ప ప్రదర్శన
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రదర్శనశాల ను శుక్రవారం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో పోలా భాస్కర్ ప్రారంభించారు. అనంతరం అక్కడున్న పురాణాలకు సంబంధించిన కళాకండాలు, కూరగాయలతో రూపొందించిన బొమ్మలను ఆసక్తిగా తిలకించారు.