=టీటీడీ చైర్మన్ బాపిరాజు
=తిరుచానూరులో శోభాయాత్ర
తిరుచానూరు, న్యూస్‌లైన్: కలియుగంలో హరి నామ సంకీర్తనతోనే ప్రశాంతత లభిస్తుందని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. సోమవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి శని వారం సాయంత్రం తిరుచానూరులో భజనమండళ్ల శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైం ది. తిరుచానూరు అమ్మవారి ఆలయం నుంచి శ్రీనివాస కల్యాణమండపం వరకు భజన బృం దాల కోలాటాలు, భజనలతో శోభాయాత్ర సాగింది.
దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్రను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 3,500 మంది భజనమండళ్ల సభ్యులు మెట్లోత్సవంలో పాల్గొంటార ని తెలిపారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పీఆర్.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణమండపంలో శనివారం ఉద యం నుంచి భజనలు, సంకీర్తనల ఆలాపన, హరిదాసుల ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిం చినట్టు చెప్పారు.
సోమవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహించి, భజన మండళ్ల సభ్యుల తో సంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటామన్నారు. స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
హరినామ సంకీర్తనతో ప్రశాంతత
Published Sun, Jan 5 2014 2:33 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement