'వరి రైతులకు న్యాయం చేయాలి'
బొబ్బిలి రూరల్ (విజయనగరం జిల్లా) : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరచి రైతులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
రైతులు విక్రయించిన వరి ధాన్యానికి సత్వరమే చెల్లింపులు చేయాలని కోరారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నవంబర్లోనే తెరిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదన్నారు. వచ్చే సీజన్లో అయినా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.