ఎమ్మెల్యే ఇంటిముందు బాంబు పేలుడు
ఇంపాల్: మణిపూర్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటి ముందు భారీ విస్ఫోటనం సంభవించింది. ఎమ్మెల్యే కరం తామర్ జిత్ సింగ్ ఇంటి గేటు ముందు బుధవారం శక్తిమంతమైన బాంబు పేలింది. దీంతో భయానక వాతావరణం నెలకొంది. అయితే ఆందోళనకు గురిచేసిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
కాగా మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కెయిరో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.