Kareena Kapoor (actress)
-
సినిమాలు లేకపోతే మీ పరిస్థితేంటి?.. కరీనా కపూర్
బాయ్‌కాట్ బాలీవుడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇటీవల బాలీవుడ్ సినిమాలపై వరుసగా వివాదాలు తలెత్తుతున్నాయి. రెండేళ్లుగా వస్తున్న బాయ్‌కాట్ వివాదం మరోసారి షారుక్ ఖాన్ మూవీ పఠాన్‌తో ట్రెండ్ అవుతోంది. ఈ అంశంపై ఏకంగా ప్రధాని మోదీ దృష్టికి వెళ్లిందంటే దీని ప్రభావం ఏమేరకు ఉందో అర్థమవుతోంది. బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ఈ వివాదంపై తాజాగా స్టార్ నటి, సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించారు. సినిమాలు లేకపోతే ప్రేక్షకులకు వినోదం ఎక్కడ లభిస్తుందని కరీనా ప్రశ్నించారు. ఇటీవల కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన నటి ఈ వ్యాఖ్యలు చేశారు. కరీనా కపూర్ మాట్లాడుతూ.. 'బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌ను ఏమాత్రం ఒప్పుకోను. ఒకవేళ సినిమాలపై నిషేధం విధిస్తే.. మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా దొరుకుతుంది. మీ జీవితంలో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? వినోదం ప్రతి ఒక్కరికీ అవసరం.' అని అన్నారు. రెండేళ్లుగా ఈ వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. తాజాగా మరోసారి ట్విట్టర్లో ట్రెండ్ పెరిగింది. 2020లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం మరింత పుంజుకుంది.షారుఖ్ ఖాన్ పఠాన్, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్, రణబీర్ కపూర్, అలియా భట్ బ్రహ్మాస్త్ర వంటి అనేక పెద్ద చిత్రాలు బాయ్‌కాట్‌ను ఎదుర్కొన్నాయి. మొదట నటీనటులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన నెటిజన్లు.. ఆ తర్వాత సినిమాలు విడుదలయ్యే సమయంలో నిషేధించాలంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. సినిమాలపై ఈ విధమైన ద్వేషాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు సినీ ప్రముఖులు ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలిశారు. కరీనా కపూర్ దర్శకుడు సుజోయ్ ఘోష్ 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' తెరకెక్కిస్తున్న థ్రిల్లర్‌లో కనిపించనుంది. ఇందులో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కూడా నటిస్తున్నారు. అంతే కాకుండా, దర్శకుడు హన్సల్ మెహతా చిత్రంలో కనిపించనుంది. -
21న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: కరీనా కపూర్ (నటి), సింగీతం శ్రీనివాసరావు (దర్శకుడు, నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించినది కాబట్టి వీరికి ఈ సంవత్సరం సృజనాత్మకత, ఊహాకల్పన, సౌందర్య పోషణ అలవడతాయి. సంఘంలో మంచి పలుకుబడి సంపాదిస్తారు. అయితే ఆలోచనలలో నిలకడ ఉండని కారణంగా ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి, తగిన జాగ్రత్తలు అవసరం. వీరు పుట్టినతేదీ 12. ఇది బృహస్పతికి చెందిన సంఖ్య కావడం వల్ల ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. విజయాలు వరిస్తాయి. కొత్తస్నేహాలు, కొత్తబంధుత్వాలు ఏర్పడి, వాటివల్ల లబ్ధి పొందుతారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. లక్కీ నంబర్స్: 1,2,3,5; లక్కీ కలర్స్: తెలుపు, క్రీమ్, శాండల్, గోల్డెన్, ఎల్లో; లక్కీ డేస్: సోమ, బుధ, గురు; శుక్రవారాలు. సూచనలు: చంద్రకాంతమణిని ధరించడం, దక్షిణామూర్తి ఆరాధన, శివుడికి అభిషేకం, గురువులను, పండితులను గౌరవించడం, ఆలయాలు, ప్రార్థనామందిరాలు, మదరసాలలో భోజన సదుపాయాలు కల్పించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్