వేములవాడకు పోటెత్తిన భక్తులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న దేవాలయానికి భక్తజనం పోటెత్తింది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రెండు కిలోమీటర్ల బారలు తీరారు. దేవాలయ ప్రాంగణంలో సౌకర్యాలు సరిగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు డిమాండ్ చేశారు
(వేములవాడ)