బ్యాంకు ఏజీఎంను దోచుకున్న దోపిడి దొంగలు
కర్నూలు: కర్నూలు జిల్లా బనగానిపల్లె మండలం రాళ్లకొత్తూరు సమీపంలోని రహదారిపై శనివారం అర్థరాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. అనంతపురం నుంచి మహానందికి కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న కర్ణాటక బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ జె.లక్ష్మీనారాయణను బెదిరించి... రూ. 38 వేల నగదుతోపాటు బంగారు చైన్‌ను లాక్కున్నారు. అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.