karnataka district
-
డేంజర్ జోన్లో 6 జిల్లాలు
బనశంకరి: రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ పెద్ద ప్రయోజనం కనబడడం లేదు. దేశంలోని 52 జిల్లాలు డేంజర్జోన్లో ఉండగా అక్కడ 100 శాతానికి పైగా కేసుల వృద్ధి నమోదవుతోంది. వాటిలో కర్ణాటకలోని 6 జిల్లాలున్నాయి. ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు 52 జిల్లాల్లో విచ్చలవిడిగా కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. అందులో దేశంలోని మహానగరాలను వెనక్కినెట్టి రాష్ట్రంలోని 6 జిల్లాలు ముందువరుసలో నిలిచాయి. కొడగుకు దేశంలోనే 3వ స్థానం.. దేశంలో అత్యధిక కరోనా కేసుల వృద్ధి ఉన్న జిల్లాల్లో 3వ స్థానంలో రాష్ట్రంలోని కాఫీనాడు కొడగు జిల్లా ఉంది. కొడగు 184 శాతం కేసుల వృద్ధిరేటు కలిగి ఉంది. తుమకూరు 146 శాతం, కోలారు 136 శాతం, మండ్య 118 శాతం, రామనగర 102 శాతం, చామరాజనగర 143 శాతం వృద్ధి రేటు కలిగి ఉన్నాయి. ఇక్కడ ఫుల్ లాక్డౌన్ శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో, కలెక్టర్లతో తాజా సమావేశం తరువాత రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురువారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ మొదలైంది. కరోనా ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి ఇప్పటికే మే 24 వరకు సడలింపులతో లాక్డౌన్ జారీలో ఉంది. కేసులు తీవ్రం కావడంతో ఉమ్మడి బళ్లారి జిల్లా, హాసన్, కల్బుర్గి, కొప్పళ, శివమొగ్గ, చిక్కబళ్లాపుర జిల్లాల్లో 4 రోజుల పాటు కఠిన లాక్డౌన్ అమలు కాబోతోంది. ఈ సమయంలో కిరాణా షాపులు కూడా తెరవనివ్వరు. -
ప్రియుడి కోసం యువతి మౌనపోరాటం
ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడు. ప్రియురాలు గర్భం దాల్చగానే.. తప్పించుకుంటూ తిరగసాగాడు. ఆ గర్భంతో తనకు సంబంధం లేదని.. తాను ఆమెను పెళ్లి చేసుకోలేనని తేల్చిచెప్పాడు. దీంతో ఆ ప్రేమికురాలు మౌనపోరాటానికి శ్రీకారం చుట్టింది. ప్రేమికుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక వర్తూరు సమీపంలోని మధురా నగరంలో నివాసముంటున్న ఓ యువతి (23), అనుగొండనహళ్లి సమీపంలోని తత్తనూరు గ్రామానికి చెందిన రవి కుందళహళ్లి గేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. వారిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని రవి నమ్మించాడు. రవిని తన ఇంటికి తీసుకెళ్లిన ఆ యువతి.. తన తల్లిదండ్రులకు పరిచయం కూడా చేసింది. ఆ చనువుతో రవి ఆ యువతి ఇంటికి వెళ్లేవాడు. ఓ సారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిద్దరూ ఏకమయ్యారు. ఇటీవల తను గర్భం దాల్చినట్లు తెలుసుకున్న ఆ యువతి.. పెళ్లి చేసుకోవాలని రవిని వేడుకుంది. ఆ గర్భంతో తనకు సంబంధం లేదని... పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. అప్పటి నుంచి విధులకు కూడా రావడం మానేశాడు. దీంతో ఆ యువతి రవి ఇంటి ముందు మంగళవారం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ గతంలోనే దీనిపై వర్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేసు నమోదు చేసుకున్న వారు రవిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని విమర్శించారు. ఆ యువతికి కొంతమంది స్థానిక మహిళలు మద్దతుపలికారు. వారిద్దరికీ పెళ్లి చేసి.. ఆ యువతికి న్యాయం చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.