ప్రియుడి కోసం యువతి మౌనపోరాటం | Lover silent war in front of wood be house in karnataka district | Sakshi
Sakshi News home page

ప్రియుడి కోసం యువతి మౌనపోరాటం

Published Wed, Jun 18 2014 10:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

ప్రియుడి కోసం యువతి మౌనపోరాటం

ప్రియుడి కోసం యువతి మౌనపోరాటం

ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడు. ప్రియురాలు గర్భం దాల్చగానే.. తప్పించుకుంటూ తిరగసాగాడు. ఆ గర్భంతో తనకు సంబంధం లేదని.. తాను ఆమెను పెళ్లి చేసుకోలేనని తేల్చిచెప్పాడు. దీంతో ఆ ప్రేమికురాలు మౌనపోరాటానికి శ్రీకారం చుట్టింది. ప్రేమికుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక వర్తూరు సమీపంలోని మధురా నగరంలో నివాసముంటున్న ఓ యువతి (23), అనుగొండనహళ్లి సమీపంలోని తత్తనూరు గ్రామానికి చెందిన రవి కుందళహళ్లి గేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. వారిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని రవి నమ్మించాడు.
 
 రవిని తన ఇంటికి తీసుకెళ్లిన ఆ యువతి.. తన తల్లిదండ్రులకు పరిచయం కూడా చేసింది. ఆ చనువుతో రవి ఆ యువతి ఇంటికి వెళ్లేవాడు. ఓ సారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిద్దరూ ఏకమయ్యారు. ఇటీవల తను గర్భం దాల్చినట్లు తెలుసుకున్న ఆ యువతి..  పెళ్లి చేసుకోవాలని రవిని వేడుకుంది. ఆ గర్భంతో తనకు సంబంధం లేదని... పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. అప్పటి నుంచి విధులకు కూడా రావడం మానేశాడు. దీంతో ఆ యువతి  రవి ఇంటి ముందు మంగళవారం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ధర్నాకు దిగింది.
 
 ఈ సందర్భంగా ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ గతంలోనే దీనిపై వర్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేసు నమోదు చేసుకున్న వారు రవిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని విమర్శించారు. ఆ యువతికి కొంతమంది స్థానిక మహిళలు మద్దతుపలికారు. వారిద్దరికీ పెళ్లి చేసి.. ఆ యువతికి న్యాయం చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement