wood be house
-
ప్రేమ జంటకు పెళ్లి జరిపించండి
జిల్లాలోని సిరుగుప్ప తాలూకా ముద్దటనూరు గ్రామంలో ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని కన్నడసేన ప్రేమికుడి ఇంటి ముందు బాధితురాలితో కలిసి ధర్నా చేశారు. సోమవారం ముద్దటనూరు గ్రామంలోని చంద్రప్ప కుమారుడు సంతోష్ ఇంటి ముందు అదే గ్రామానికి చెందిన బాధితురాలు కే.రాజమ్మ అలియాస్ రాజేశ్వరి, ఆమె తండ్రి తిప్పయ్య, కన్నడ సేన పదాధికారులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏడాదిగా రాజేశ్వరిని సంతోష్ ప్రేమిస్తున్నాడని, తల్లిదండ్రుల మాట విని పరారై ఇటీవలే గ్రామానికి తిరిగి రావడంతో కన్నడ సేన హై-క వలయ ఉపాధ్యక్షుడు కే.ఎర్రిస్వామి నేతృత్వంలో సోమవారం సంతోష్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సంతోష్ తల్లిదండ్రులు కట్నం కోసం వేరే సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో కన్నడసేన సహకారంతో జూన్ 24న సిరిగేరి పోలీస్ స్టేషన్లో సంతోష్, చంద్రప్ప మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ జంటకు పెళ్లి చేసేంతవరకు ఈ పోరాటం ఆగదని సేన కార్యకర్తలు చెప్పారు. ఆందోళనలో కన్నడ సేన కర్ణాటక పదాధికారులు బీ.శ్రీనివాస్, జీ.సుధాకర్, పీ.బసవరాజ్, గాదెప్ప, రాఘవేంద్ర, లక్ష్మీ, అనిత, ఈరమ్మ, సయ్యద్బాషా, అబ్దులాజీ, రహిమాన్, గ్రామస్తులు చింతామణి, రాఘవేంద్ర, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రియుడి కోసం యువతి మౌనపోరాటం
ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడు. ప్రియురాలు గర్భం దాల్చగానే.. తప్పించుకుంటూ తిరగసాగాడు. ఆ గర్భంతో తనకు సంబంధం లేదని.. తాను ఆమెను పెళ్లి చేసుకోలేనని తేల్చిచెప్పాడు. దీంతో ఆ ప్రేమికురాలు మౌనపోరాటానికి శ్రీకారం చుట్టింది. ప్రేమికుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక వర్తూరు సమీపంలోని మధురా నగరంలో నివాసముంటున్న ఓ యువతి (23), అనుగొండనహళ్లి సమీపంలోని తత్తనూరు గ్రామానికి చెందిన రవి కుందళహళ్లి గేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. వారిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని రవి నమ్మించాడు. రవిని తన ఇంటికి తీసుకెళ్లిన ఆ యువతి.. తన తల్లిదండ్రులకు పరిచయం కూడా చేసింది. ఆ చనువుతో రవి ఆ యువతి ఇంటికి వెళ్లేవాడు. ఓ సారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిద్దరూ ఏకమయ్యారు. ఇటీవల తను గర్భం దాల్చినట్లు తెలుసుకున్న ఆ యువతి.. పెళ్లి చేసుకోవాలని రవిని వేడుకుంది. ఆ గర్భంతో తనకు సంబంధం లేదని... పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. అప్పటి నుంచి విధులకు కూడా రావడం మానేశాడు. దీంతో ఆ యువతి రవి ఇంటి ముందు మంగళవారం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ గతంలోనే దీనిపై వర్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేసు నమోదు చేసుకున్న వారు రవిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని విమర్శించారు. ఆ యువతికి కొంతమంది స్థానిక మహిళలు మద్దతుపలికారు. వారిద్దరికీ పెళ్లి చేసి.. ఆ యువతికి న్యాయం చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.