సూర్యాపేటలో నకిలీనోట్ల ముఠా అరెస్ట్
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో నకిలీనోట్ల ముఠాకు చెందిన నలుగురిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.10 లక్షల నకిలీ నోట్లు, ల్యాప్టాప్, ప్రింటర్, కర్ణాటక వర్సిటీకి చెందిన నర్సింగ్ నకిలీ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.