తుది నిర్ణయం హైకమాండ్ దే: డీసీసీ
కర్నూలు: ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీ చేయాలా వద్దా అనే నిర్ణయంపై కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని కర్నూలు డీసీసీ ప్రతినిధులు తెలిపారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని కర్నూలు డీసీసీ హైకమాండ్ కు సూచించింది. ఆళ్లగడ్డలో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేత భూమా శోభానాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే అధికార పార్టీ తెలుగుదేశం పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది.