నెదర్లాండ్స్ కార్పస్ మ్యూజియం
మీలో మీరెప్పుడైనా తొంగి చూశారా? చూడలేదా.. నెదర్లాండ్స్‌లోని కార్పస్ మ్యూజియానికి వెళ్తే.. మనకా అవకాశం లభిస్తుంది. ఈ మ్యూజియం మానవ శరీర పనితీరును వివరిస్తుంది. ఓ భారీ మానవ శరీరం ఆకారంలో ఉండే బొమ్మలోకి వెళ్లడం ద్వారా అందులోని ప్రతి భాగం పనితీరును క్షుణ్నంగా తెలుసుకోవచ్చు.
కాళ్ల దగ్గర నుంచి మొదలుపెడితే.. మెదడు దాకా.. అచ్చంగా మన శరీరం ఎలా పనిచేస్తుందో ఇదీ అలాగే పనిచేస్తుంది. ఆహారాన్ని పేగులు జీర్ణం చేసుకోవడాన్ని కూడా వీక్షించొచ్చు. కడుపులో వచ్చే శబ్దాలు కూడా వినిపిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనం, వ్యాయామం వంటివి శరీరంపై ఎలాంటి సానుకూల ఫలితాలు చూపుతాయన్న విషయాన్ని స్వయంగా గ్రహించవచ్చు. ఆమ్స్టర్డామ్ నుంచి హేగ్‌కు వెళ్లే దారిలో ఈ కార్పస్ మ్యూజియం ఉంటుంది.