బైక్ ర్యాలీ ప్రారంభం
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు తలొగ్గి పాలన కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు అన్నారు. కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ప్రజల స్వాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తున్నారని విమర్శించారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా జరుపుకోవాలన్న తెలంగాణ ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. చరిత్రను మరిపించేందుకు కుట్ర చేస్తుందన్నారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారింగా నిర్వహించే వరకు తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తునికి దశర«థ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.