నేడు విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సభ
సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ జింఖానా మైదానంలో సోమవారం ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఉద్యోగుల బహిరంగ సభ జరుగనుంది.
ఏపీ కాంట్రాక్టు విద్యుత్ కార్మికుల ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కాశీనాథ బాబు అధ్యక్షతన జరిగే సభలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.
15 ఏళ్ల నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. బహిరంగ సభ ద్వారా తమ నిరవధిక సమ్మెను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.