kasthurba
-
సికింద్రాబాద్ కస్తూర్బా మహిళా కాలేజీలో గ్యాస్ లీక్..
-
కస్తూర్భా పాఠశాల ఆకస్మిక తనిఖీ
సాక్షి, ఏలూరు : నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కస్తూర్భా మున్సిపల్ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నాడు-నేడు కార్యక్రమం ఎంతో గొప్పదని కొనియాడారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో రాజీ పడొద్దని తెలిపారు. శనివారపుపేట ఎంపిపి పాఠశాలలోనూ నాడు- నేడు పనులు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ జరిగిన పనులను మిగతా పాఠశాల యాజమాన్యం సందర్శించి వారి వారి పాఠశాలల్లో పనులు చేయించాలంటూ కోరారు. ఇక కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు వారి ఇష్టప్రకారమే పాఠశాలకు రావచ్చని, పాఠశాలల్లో తప్పనిసరిగా భౌతికాదూరం పాటించాలన్నారు. విద్యార్థులకు విద్యా వారధి ద్వారా అవసరమైన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది. విద్యార్థులకు విద్యా వారధి ద్వారా అవసరమైన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. కస్తూర్భా పాఠశాలలను డెమో పాఠశాలగా మార్చుతున్నామని, అందువల్ల దీన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అధికారులను కోరారు. (ఫిర్యాదు చేసుకోండి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం) -
23 ఏళ్ల తర్వాత ఇంటికి...
రాజేంద్రనగర్: ఇంటి నుంచి వెళ్లిన 23 సంవత్సరాల అనంతరం ఓ మహిళ కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. ఈ సంఘటన హైదర్షాకోట్ కస్తూర్బా ట్రస్టులో చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని మహిళలకు పదేళ్ల చికిత్స తర్వాత ఒక్కొక్కటిగా చిన్ననాటి విషయాలు గుర్తుకు రావడంతో కస్తూర్బా ట్రస్ట్ నిర్వాహకురాలు పద్మావతి పోలీసుల సహాయంతో కుటుంబసభ్యులను వెతికి షీటీమ్ డీసీపీ అనురాధ సమక్షంలో సోమవారం వారికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ గిరినగర్ ప్రాంతానికి చెందిన యాదమ్మ, సత్తయ్య దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్తయ్య హెచ్ఏఎల్లో విధులు నిర్వహించగా యాదమ్మ ఇంటి వద్దే దుస్తు్తలు ఇస్త్రీ చేసేది. పెద్ద కూతురైన మసినూరి రేణుక(40) తల్లికి చేదోడు వాదోడుగా ఉండేది. వీరి ఇంటి పక్కనే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం నివసించేంది. 1995లో రాత్రికి రాత్రే తమిళనాడు కుటుంబం రేణుకను తీసుకొని వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు రేణుక కోసం సంవత్సరాల తరబడి వెతికారు. ఇంటి నుంచి వెళ్లిన సమయంలో రేణుక 17 సంవత్సరాల వయస్సు. 18 ఏళ్లుగా ఆశ్రమాల్లోనే.. 2001లో చెన్నై రైల్వే స్టేషన్లో మతిస్థిమితం లేని రేణుకను అక్కడి పోలీసులు గుర్తించి బనియన్ ఆర్గనైజేషన్ సొసైటీకి అప్పగించారు. అప్పటి నుంచి అక్కడే ఆశ్రమం పొందుతోంది. హైదరాబాద్ నుంచి వచ్చాను అనే మాట తప్ప మరే ఇతర వివరాలు చెప్పలేదు. దీంతో నిర్వాహకులు 2011లో హైదరాబాద్‌కు వచ్చి వాకబు చేశారు. అనంతరం 2012 జూలై 20న బనియన్ ఆర్గనైజేషన్ వారు హైదర్షాకోట్లోని కస్తూర్బా ట్రస్టు నిర్వాహకులకు రేణుకను అప్పగించారు. ట్రస్టు నిర్వాహకులు చికిత్స అందిస్తూ ఆశ్రయం కల్పించారు. 10 రోజుల క్రితం కోలుకున్న రేణుక తాను ఉండే ప్రాంతం పేరుతో పాటు తండ్రి హెచ్ఏఎల్లో పని చేసేవాడని తనకు ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని, తల్లి బట్టలు ఇస్త్రీ చేసేదని తెలిపింది. పోలీసుల సాయంతో ఆచూకీ లభ్యం చిన్ననాటి విషయాలన్ని ఒకొక్కటిగా చెబుతుండడంతో ట్రస్టు నిర్వహకురాలు పద్మావతి బాలానగర్ పోలీసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ వర్కర్లను సంప్రదించారు. స్థానికంగా ఇస్త్రీ బట్టలు చేసే వారి వివరాలు సేకరించింది. గిరినగర్ ప్రాంతంలో 23 ఏళ్ల క్రితం రేణుక తప్పిపోయిందని సమాచారం అందడంతో ట్రస్టు నిర్వహకులు ఆమె సోదరుడు వెంకటేష్‌ను సంప్రదించారు. వెంకటేష్ తన సోదరి పూర్తి వివరాలను ట్రస్టు నిర్వాహకులకు అందించాడు. సోమవారం మధ్యాహ్నం షీటీమ్ ఇన్చార్జి డీసీపీ అనురాధ సమక్షంలో రేణుక తల్లి యాదమ్మ, సోదరుడు వెంకటేష్‌లకు ఆమెను అప్పగించారు. రెండు దశాబ్దాల తర్వాత కూతురిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ట్రస్తు నిర్వాహకులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రేణుక తాను తల్లితో ఇంటికి వెళ్తానని, ట్రస్ట్‌లోని సభ్యులంతా గుర్తుకు వస్తే వచ్చి చూసి వెళ్తానని చెప్పింది. అన్ని వివరాలు నమోదు చేసుకున్నాక పోలీసులు రేణుకను కుటుంబసభ్యులకు అప్పగించారు. -
శ్రీమంతుడు
సుండుపల్లి: శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేసే సుండుపల్లి ఎస్ఐ నరసింహారెడ్డి సమాజ సేవకు పాటుపడుతున్నారు. కస్తూర్బా బాలికా విద్యాలయాన్ని దత్తత తీసుకుని.. పాఠశాలలో వసతుల కల్పనకు తోడ్పడుతున్నారు. ♦ కస్తూర్బా బాలికా విద్యాలయాన్ని ఎస్ఐ జూన్ నెలలో దత్తత తీసుకున్నారు. ఓ పక్క విధులు నిర్వహిస్తూ.. పాఠశాల అభివృద్ధికి కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. 200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల కోసం ఆవరణంలో 5 ఎకరాల్లో ఉన్న గుట్టలను జేసీబీ సాయంతో తొలగించి క్రీడలు ఆడుకునేందుకు చక్కటి మైదానం ఏర్పాటు చేశారు. కొంతభాగంలో పచ్చని తోటలాగా ఏర్పాటు చేశారు. ♦ మైదానంలో రాత్రిపూట చదువు కునేందుకు వీలుగా ఏడు విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసి కాంతివంతమైన లైట్లను అమర్చారు. విద్యార్థుల వంట కోసం, స్నానాల కోసం, బట్టలు ఉతికేందుకు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిసి బోరు వేయించారు. బోరు విఫలమైనా వెనక్కు తగ్గలేదు. మరోబోరు వేయించారు. దీంతో నీటి సమస్య తీరింది. వారానికి ఒకసారి ట్యాంకర్ ద్వారా వచ్చే నీటితో ఇబ్బందులు పడే విద్యార్థినులకు ఇక నీటి సమస్య తీరింది. ♦ దుస్తులు ఉతికేందుకు దోబీగాట్ ఏర్పాటు చేయించారు. తరగతి గదుల్లో బేంచీలకు మరమ్మతులు చేయించారు. మురుగునీరు బయటకు వెళ్లేందుకు కొత్త పైపులైను.. టాయ్లెట్లల్లో పింగానీలు, స్నానపుగదుల్లో టైల్స్ ఏర్పాటు చేయించారు. ఆహ్లాదకరంగా ఉంది మా పాఠశాలను ఎస్ఐ నరసింహారెడ్డి సారు దత్తత తీసుకున్నప్పటి నుంచి అన్ని సౌకర్యాలు కల్పించారు. గతంలో స్కూల్లో చదువుకోవాలన్నా చాలా ఇబ్బందులకు గురయ్యాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. – అవని, 9వ తరగతి విద్యాభివృద్ధికి సహకారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి సహకారం అందిస్తున్నా. రాయలసీమ ఐజీ ఇచ్చిన సూచన మేరకు ఈ పాఠశాలను దత్తత తీసుకున్నా. కస్తూర్బా పాఠశాలలో వసతులు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా. జి.రెడ్డివారిపల్లె గ్రామ పంచాయితీని దత్తత తీసుకుని సిమెంటు రోడ్డు ఏర్పాటుకు, మరుగుదొడ్లపై ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా. – నరసింహారెడ్డి, ఎస్ఐ, సుండుపల్లి -
చున్నీలు నెట్లయ్యాయి... మరి నిధులేమయ్యాయి?
కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థినుల చదువుకు, క్రీడా పరికరాలకు వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ ఆ కేటాయింపులు విద్యార్థినుల వరకు చేరడం లేదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమీ చిత్రం. బలిజిపేటలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులు నెట్ లేక ఇలా చున్నీలు కట్టుకుని ఆడుతున్నారు. పాఠశాలకు ఏటా *10వేల వరకు క్రీడా పరికరాల కొనుగోలుకు మంజూరవుతాయి. నిధులతో పరికరాలు కొని బిల్లులు పెడతారు. కానీ ఎక్కడా పరికరాలైతే కనిపిం చడం లేదు. రింగు ఆట పరికరాలు, క్యారంబోర్డు, చెస్, టెన్నిస్ బ్యాట్లు వంటి పరికరాలు కొనుగోలు చేయాలి. 2015-16కుగాను ఎనిమిది వేల రూపాయల నిధులు మంజూరయ్యాయి. నేటి వరకు ఒక్క పైసా అయినా ఖర్చు చేయలేదు. దీనిపై ప్రిన్సిపాల్ హరితను వివరణ కోరగా ఈ సంవత్సరం నిధులు ఖర్చు చేయలేదని తెలిపారు. అన్ని పరికరాలు ఉన్నాయన్నారు. - బలిజిపేట రూరల్