చున్నీలు నెట్‌లయ్యాయి... మరి నిధులేమయ్యాయి?
కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థినుల చదువుకు, క్రీడా పరికరాలకు వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ ఆ కేటాయింపులు విద్యార్థినుల వరకు చేరడం లేదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమీ చిత్రం. బలిజిపేటలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులు నెట్ లేక ఇలా చున్నీలు కట్టుకుని ఆడుతున్నారు. పాఠశాలకు ఏటా *10వేల వరకు క్రీడా పరికరాల కొనుగోలుకు మంజూరవుతాయి.
నిధులతో పరికరాలు కొని బిల్లులు పెడతారు. కానీ ఎక్కడా పరికరాలైతే కనిపిం చడం లేదు. రింగు ఆట పరికరాలు, క్యారంబోర్డు, చెస్, టెన్నిస్ బ్యాట్లు వంటి పరికరాలు కొనుగోలు చేయాలి. 2015-16కుగాను ఎనిమిది వేల రూపాయల నిధులు మంజూరయ్యాయి. నేటి వరకు ఒక్క పైసా అయినా ఖర్చు చేయలేదు. దీనిపై ప్రిన్సిపాల్ హరితను వివరణ కోరగా ఈ సంవత్సరం నిధులు ఖర్చు చేయలేదని తెలిపారు. అన్ని పరికరాలు ఉన్నాయన్నారు.
- బలిజిపేట రూరల్