సాక్షి, ఏలూరు : నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కస్తూర్భా మున్సిపల్ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నాడు-నేడు కార్యక్రమం ఎంతో గొప్పదని కొనియాడారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో రాజీ పడొద్దని తెలిపారు. శనివారపుపేట ఎంపిపి పాఠశాలలోనూ నాడు- నేడు పనులు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ జరిగిన పనులను మిగతా పాఠశాల యాజమాన్యం సందర్శించి వారి వారి పాఠశాలల్లో పనులు చేయించాలంటూ కోరారు.
ఇక కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు వారి ఇష్టప్రకారమే పాఠశాలకు రావచ్చని, పాఠశాలల్లో తప్పనిసరిగా భౌతికాదూరం పాటించాలన్నారు. విద్యార్థులకు విద్యా వారధి ద్వారా అవసరమైన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది. విద్యార్థులకు విద్యా వారధి ద్వారా అవసరమైన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. కస్తూర్భా పాఠశాలలను డెమో పాఠశాలగా మార్చుతున్నామని, అందువల్ల దీన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అధికారులను కోరారు. (ఫిర్యాదు చేసుకోండి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం)
Comments
Please login to add a commentAdd a comment