kathakali
-
మరో వివాదంలో సెన్సార్ బోర్డు..
త్రివేండ్రం: సెన్సార్ బోర్డుపై మరో సినీ పరిశ్రమ యుద్ధం ప్రకటించింది. కథకళి సినిమాకు యూ సర్టిఫికెట్ ను నిరాకరించినందుకు... మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ దర్శకులు, నిర్మాతలు సోమవారం త్రివేండ్రంలోని సీబీఎఫ్‑సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయిన యువ దర్శకుడు సజ్జు కన్నానైక్కల్ కథకళి చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్రానికి ప్రాణంలాంటి సన్నివేశాలను బోర్డు అధికారులు కత్తిరించేశారని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్ర యూనిట్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, నిబంధనలకు అనుగుణంగానే కథకళి సినిమాను సర్టిఫై చేశామని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కథకళి నిర్మాతల పిటిషన్ స్వీకరించిన హైకోర్టు సీబీఎఫ్ సీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, సినిమా క్లైమాక్స్ లో కథకళి వేషాన్ని వదిలిపెట్టి వ్యక్తి న్యూడ్ గా పరుగెత్తే సీన్ ను తొలగించాలంటూ సీబీఎఫ్ సీ మేకర్స్ కు సూచించింది. దీనిపై స్పందించిన డెరెక్టర్ ఆ సీన్ సినిమాకు సింబాలిక్ రిప్రజెంటేషన్ అని దానిని తీయలేమని వాదిస్తున్నారు. దేశ వ్యతిరేకంగా కానీ, సెక్సువల్ గా కానీ, మహిళలను వేధించడం లాంటి సీన్ లు ఏమి సినిమాలో లేవని.. కేవలం చివరిలో ఒక వ్యక్తి న్యూడ్ గా నడుచుకుంటూ వెళ్తాడని, అది కూడా లాంగ్ షాట్ లో తీశామని సజ్జు తెలిపారు. కానీ, సీబీఎఫ్ సీ బోర్డు చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం సమజసం కాదని అన్నారు. కాగా, క్లైమాక్స్, రెండో రీల్ లో బాస్టర్డ్ అనే పదం అక్కడే ఓ వ్యక్తి వస్త్రాలు తీసేసి చితక్కొట్టే సీన్ లను తొలగించాలని బోర్డు తెలిపింది. 83 కట్లు విధించినందుకు ఉడ్తా పంజాబ్ నిర్మాతలు బెంబే హైకోర్టులో న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే. -
నన్ను అందుకే వాడుకుంటున్నారు
నన్ను గ్లామర్‌కే వాడుకుంటున్నారని తెగ బాధ పడిపోతోంది నటి క్యాథరిన్ ట్రెసా. కోలీవుడ్‌లో గట్టి పోటీ ఉన్నా అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది ఈ అమ్మడు. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అందాలారబోతలో దుమ్మురేపిన ఈ దుబాయ్ బ్యూటీ తమిళలోకొచ్చేసరికి మెడ్రాస్ చిత్రంలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో బాగానే నటించింది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఇకపై అలాంటి నటనకు అవకాశం ఉన్నా మంచి పాత్రలు వస్తాయని ఆశించింది. అయితే అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటి అన్నట్టుగా క్యాథరిన్ పరిస్థితి మారింది. ఆ తరువాత విశాల్ సరసన కథకళి, అధర్వతో కణిదన్ చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు విజయం సాధించినా వాటిలో ఈ అమ్మడు గ్లామర్‌డాల్ పాత్రలకే పరిమితమైంది. దీంతో ఎంతో బాధ పడిపోతున్న క్యాథరిన్ ట్రెసా తనను దర్శక నిర్మాతలు గ్లామర్‌కే వాడుకుంటున్నారని తెగ ఇదైపోతోంది. మోడ్రన్ పేరుతో కురచ దుస్తులు ధరింపజేస్తున్నారని వాపోతోంది. గ్లామరస్ పాత్రలతో అభిమానులు పెరుగుతున్నారన్నది కాస్త సంతోషంగా ఉన్నా మరీ అలాంటి పాత్రలకే ట్రేడ్ మార్క్‌గా మార్చేయడం బాధగా ఉందని పేర్కొంది. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాకుండా ఎంత మంచి పాత్రలు పోషించామన్నదే లెక్కకొస్తుందనీ అలా చెప్పుకునే మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని క్యాథరిన్ ట్రెసా అంటోంది.నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తే తన సత్తా చాటుకుంటానని పేర్కొంది. -
ఆ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకేరోజు
సినీరంగంలో తమ సినిమాతో తామే పోటీ పడటానికి తారలు ఇష్టపడరు. హీరోయిన్ల విషయంలో ఇలా ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం అప్పుడప్పుడు ఉంటుంది. కానీ, హీరోలు, సాంకేతిక నిపుణుల విషయంలో మాత్రం చాలా అరుదు. చాలా ఏళ్ల కిందట బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి రికార్డ్ సృష్టించాయి. కృష్ణ హీరోగా నటించిన సినిమాలు కూడా పలు సందర్భాల్లో తక్కువ గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. కానీ ఒకే దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం అత్యంత అరుదు. అలాంటి అరుదైన రిలీజ్ ఈ శుక్రవారం జరగనుంది. తమిళ దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన కథాకళి, మేము సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన పసంగ 2 సినిమా.. మేము పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. తమిళంలో గత ఏడాది డిసెంబర్లోనే రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆలస్యంగా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు ఇదే దర్శకుడి, డైరెక్షన్లో తెరకెక్కిన కథాకళి సినిమా కూడా తమిళ్లో జనవరిలోనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను కూడా తెలుగులో ఈ శుక్రవారమే రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. అలా ఒకే దర్శకుడి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వటం టాలీవుడ్ సరికొత్త రికార్డ్. -
స్టార్ హీరోలతో ఢీ అంటున్న డబ్బింగ్ స్టార్
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు టాప్ టెక్నీషియన్లు తమ సినిమాలు సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అదే బాటలో ఈ సంక్రాంతికి టాలీవుడ్ టాప్ స్టార్లు తమ సినిమాలతో రెడీ అవుతున్నారు. సంక్రాంతి హీరోగా పేరున్న బాలయ్య డిక్టేటర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తుండగా, నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తొలిసారిగా బాబాయ్‌తో ఢీ అంటూ అబ్బాయి ఎన్టీఆర్ కూడా నాన్నకు ప్రేమతో సినిమాతో అదే సీజన్‌ను టార్గెట్ చేస్తున్నాడు. తెలుగులోనే టాప్ హీరోలు బెర్త్ కోసం వేచి చూస్తుంటే కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ మాత్రం తన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళిని సంక్రాంతికే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడట. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా పాండ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు విశాల్. అందుకే తమిళ వర్షన్‌కు ప్రకటించిన సంక్రాంతి సీజన్లోనే తెలుగు వర్షన్‌ను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఇటీవలే నడిగర్ సంఘం ఎలక్షన్లలో సత్తా చాటిన విశాల్, టాలీవుడ్ సంక్రాంతి బరిలో ఎంతవరకు నిలబడతాడో చూడాలి.