ఆ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకేరోజు | Director pandirajs Kathakali memu releasing on same date | Sakshi
Sakshi News home page

ఆ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకేరోజు

Published Tue, Mar 15 2016 9:12 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

ఆ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకేరోజు

ఆ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకేరోజు

సినీరంగంలో తమ సినిమాతో తామే పోటీ పడటానికి తారలు ఇష్టపడరు. హీరోయిన్ల విషయంలో ఇలా ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం అప్పుడప్పుడు ఉంటుంది. కానీ, హీరోలు, సాంకేతిక నిపుణుల విషయంలో మాత్రం చాలా అరుదు. చాలా ఏళ్ల కిందట బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి రికార్డ్ సృష్టించాయి. కృష్ణ హీరోగా నటించిన సినిమాలు కూడా పలు సందర్భాల్లో తక్కువ గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. కానీ ఒకే దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం అత్యంత అరుదు. అలాంటి అరుదైన రిలీజ్ ఈ శుక్రవారం జరగనుంది.

తమిళ దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన కథాకళి, మేము సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన పసంగ 2 సినిమా.. మేము పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. తమిళంలో గత ఏడాది డిసెంబర్లోనే రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆలస్యంగా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు ఇదే దర్శకుడి, డైరెక్షన్లో తెరకెక్కిన కథాకళి సినిమా కూడా తమిళ్లో జనవరిలోనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను కూడా తెలుగులో ఈ శుక్రవారమే రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. అలా ఒకే దర్శకుడి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వటం టాలీవుడ్ సరికొత్త రికార్డ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement