విశాల్ ,సూర్య ,కార్తీ ,విజయ్
తమిళసినిమా: అభిమానులు లేనిదే హీరోలు లేరు అన్నది నగ్నసత్యం. ఏ కథానాయకుడైనా ఉన్నత స్థితిలో ఉన్నాడంటే అందుకు అభిమానుల ఆదరణే ప్రధాన కారణం. అ తరువాతే అదృష్టం, కృషి, శ్రమ ఏదైనా. అందుకే నా అండా, దండా అభిమానులే, ప్రేక్షకులే నా దేవుళ్లు అని అం టుంటారు. నిజానికి వారి మార్కెట్‌ను పెంచుకోవడానికి కారకులు అభిమానులే. అదేవిధంగా రాజకీయరంగానికి, సినిమారంగానికి అవినాభా వ సంబంధం ఉంది. సినీమారంగం నుంచి వెళ్లిన ప్రముఖులు తమిళనాడు నిన్నటి వరకూ ఏలారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా తాజాగా సినీరంగంలో దిగ్గజాలుగా రాణిస్తున్న కమలహాసన్, రజనీకాంత్ లాంటి వారు రాజకీయరంగప్రవేశం చేస్తున్నారంటూ అభిమానులను నమ్ముకునే పార్టీ రథ సారథులు వారే అవుతారు. వారి తరువాత తరం నటులైన విజయ్, సూర్య, విశాల్ లాంటి వారు కూడా అభిమానంతోనూ సినీరంగంలోనూ, రాజకీయరంగంలోనూ రాణించాలని ఆశపడుతున్నారు.
బలోపేత ప్రయత్నాలు ముమ్మరం
నిజం చెప్పాలంటే రజనీకాంత్, కమలహాసన్‌ల కంటే ముందే విజయ్‌లో రాజకీయ ఆలోచన తలెత్తిందని చెప్పవచ్చు. రజనీకాంత్ తరువాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్. అలాంటి ఆయన ఎదుగుదలను తొక్కేయడానికి రాజకీయంగా కుట్రలు జరిగాయనే ప్రచారం చాలా కాలం క్రితమే హోరెత్తింది. విజయ్ నటించిన తలైవా, కత్తి, చివరికి ఆ మధ్య వచ్చిన పులి చిత్రం విడుదలను కూడా అడ్డుకునే కుట్ర జరిగిందంటారు. విజయ్ చాలా కాలం క్రితమే రాజకీయ ప్రవేశం ఆలోచనతో తన అభిమాన సంఘాలను ప్రజాసంఘాలుగా మార్చారు. విజయ్ రాజకీయరంగం ప్రవేశం చేస్తాడని ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ బహిరంగంగానే వెల్లడించారు కూడా. అయితే కారణాలేమైన విజయ్ ఆ తరువాత రాజకీయ ప్రస్థావనకు దూరంగా ఉంటున్నారు. అయితే ముందుముందు ఆయన రాజకీయ రంగప్రవేశానికి పావులు కదుపుతారనే మాట వినిపిస్తోంది. తన అభిమా సంఘాల ద్వారా సేవాకార్యక్రమాలను తరుచూ నిర్వహిస్తున్నారు. ఇటీవల తూత్తుక్కుడి కాల్పులు సంఘటనలో బలైన వారి కుటుంబాలను పరామర్శించి వచ్చారు.
విశాల్‌కు రాజకీయ ఆలోచన
తమిళసినీరంగంలో నటుడిగా రాణిస్తూ, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా ఏక కాలంలో పదవీ బాధ్యలను నిర్వహిస్తున్న విశాల్ ఒక శక్తిగా ఎదిగే ప్రయత్నాలు మొదలెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈయన కూడా తానూ రాజకీయాలకు రెడీ అంటూ సడన్‌గా ప్రకటించడంతో పాటు ఆ మధ్య ఆర్‌కే.నగర్ ఉపఎన్నికల్లో పోటీకి దిగి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన అభిమాన సంఘాల ద్వారా, ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విశాల్ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో రాజకీయాలవైపు అడుగులు వేస్తారని విశ్లేషణ జరుగుతోంది.
సూర్య, కార్తీ రాజకీయాలపై దృష్టి
అదేవిధంగా స్టార్ హీరోల సోదరద్వయం సూర్య, కార్తీలకు రాజకీయ ఆలోచన కలిగినట్లు ప్రచారం జరుగుతోంది. వీరు చాలా కాలంగా అగరం ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా విద్యాదానం చేస్తున్నారు. విశాల్, సూర్య, కార్తీ కలిసి పనిచేయడానికి కార్యరూపం దాల్చుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే నటుడు విజయ్, విశాల్, సూర్య, కార్తీలు తమ అభిమానులను బలోపేతం చేసే పనిలో ముమ్మరం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ స్టార్ హీరోలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేక కొత్తగా తమిళనాడు రాజకీయాల్లో కమలహాసనా? రజనీకాంతా? అన్న పరిస్థితి నెలకొన్నప్పుడు తమ మద్దతు అవసరం అవుతుందనో తమ అభిమానుల బలం పెంచుకునే పనిలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment