Pandi raj
-
సూర్య 40: మంచి కిక్ ఇచ్చే మాస్ టైటిల్, త్వరలో వెల్లడి
సాక్షి, చెన్నై: సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 35 శాతం పూర్తయిందని పాండిరాజ్ వెల్లడించారు. ఈ సినిమా గురించి ఇంకా పాండిరాజ్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే చిత్రీకరణను తిరిగా ప్రారంభిస్తాం త్వరలో ప్రీ లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది. సూర్య అభిమానులకు కిక్ ఇచ్చేలా టైటిల్ మాసీగా ఉంటుంది. వచ్చే నెలలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారు. కోవిడ్ ఆటంకాలు లేకుండా అనుకున్న ప్రకారం షూటింగ్ జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. చదవండి: ‘శ్రుతీ.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ -
సూర్యతో రష్మిక?
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ క్రేజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు రష్మిక మందన్నా. మాతృభాష కన్నడలోనూ సత్తా చాటుతున్నారీ బ్యూటీ. తెలుగు, కన్నడ భాషల్లో బిజీగా ఉన్నా కోలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్నారామె. కార్తీ హీరోగా బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుల్తాన్’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు రష్మిక. ఈ సినిమా ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కోలీవుడ్‌లో మొదటి సినిమా విడుదలవక ముందే రష్మికని మరో క్రేజీ ఆఫర్ వరించిందని టాక్. కార్తీ సోదరుడు, హీరో సూర్య సరసన ఓ సినిమాలో నటించే అవకాశం అందుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో కథానాయిక చాన్స్ రష్మికని వరించిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుందట. ఇటీవల ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో హిట్ కొట్టిన సూర్య తర్వాతి సినిమాల్ని త్వరగా పూర్తి చేసేందుకు రెట్టింపు ఉత్సాహంతో సన్నద్ధం అవుతున్నారట. కాగా రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలోనూ, కన్నడలో ‘పొగరు’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. -
‘నమ్మవీట్టు పిళ్లై’ రిలీజ్ ఎప్పుడంటే!
నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం నమ్మవీట్టుపిళ్లై. ఆయనకు జంటగా అనుఇమ్మాన్యువేల్ నటించింది. ఈ బ్యూటీ చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో నటించిన చిత్రం ఇది. ఇకపోతే ఇందులో మరో నటి ఐశ్వర్యరాజేశ్ శివకార్తికేయన్‌కు చెల్లెలిగా ముఖ్య పాత్రలో నటించింది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన మరో గ్రామీణ కథా చిత్రం నమ్మవీట్టుపిళ్లై. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు భారతీరాజా, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటించారు. వారితో పాటు నట్టి, ఆర్కే.సురేశ్, సూరి, యోగిబాబు, వేలరామమూర్తి, నాడోడిగళ్ గోపాల్, సుబ్బుపంజు, అర్చన, షీలా, సంతానలక్ష్మి ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను తెచ్చుకున్నాయి. దీనికి నీరవ్‌షా ఛాయాగ్రహణం అందించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్ పొందింది. కాగా నమ్మవీట్టుపిళ్లై చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం శుక్రవారం అధికారపూర్వకంగా ప్రకటించారు. ఈ చిత్రంపై నటుడు శివకార్తికేయన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన చిత్రాలు వరుసగా నిరాశపరచడమే ఇందుకు కారణం. అదీ కాకుండా శివకార్తికేయన్ తొలి రోజుల్లో పాండిరాజ్ దర్శకత్వంలో మెరినా, కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రాల్లో నటించారు. అవి మంచి సక్సెస్ అయ్యాయి. తాజాగా నటించిన నమ్మవీట్టుపిళ్లై వీరి కాంబినేషన్లో రూపొందిన మూడవ చిత్రం అవుతుంది. ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరో చిత్రంలో నటిస్తున్నారు. -
ఆ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకేరోజు
సినీరంగంలో తమ సినిమాతో తామే పోటీ పడటానికి తారలు ఇష్టపడరు. హీరోయిన్ల విషయంలో ఇలా ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం అప్పుడప్పుడు ఉంటుంది. కానీ, హీరోలు, సాంకేతిక నిపుణుల విషయంలో మాత్రం చాలా అరుదు. చాలా ఏళ్ల కిందట బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి రికార్డ్ సృష్టించాయి. కృష్ణ హీరోగా నటించిన సినిమాలు కూడా పలు సందర్భాల్లో తక్కువ గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. కానీ ఒకే దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం అత్యంత అరుదు. అలాంటి అరుదైన రిలీజ్ ఈ శుక్రవారం జరగనుంది. తమిళ దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన కథాకళి, మేము సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన పసంగ 2 సినిమా.. మేము పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. తమిళంలో గత ఏడాది డిసెంబర్లోనే రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆలస్యంగా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు ఇదే దర్శకుడి, డైరెక్షన్లో తెరకెక్కిన కథాకళి సినిమా కూడా తమిళ్లో జనవరిలోనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను కూడా తెలుగులో ఈ శుక్రవారమే రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. అలా ఒకే దర్శకుడి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వటం టాలీవుడ్ సరికొత్త రికార్డ్.