Katti Venkata Swamy
-
నాయక్‌పై దూసిన కత్తి
వరంగల్, న్యూస్‌లైన్: తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కేంద్ర మంత్రి, మానుకోట ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి కత్తి వెంకటస్వామి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్లాటకు దిగడం జిల్లాలో చర్చనీయూంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో గెలుపోటములపై జిల్లాలోని అభ్యర్థులు,ముఖ్య నేతలతో హైదరాబాద్ గాంధీభవన్‌లో సోమవారం తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమీక్షించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తనకు బలరాం నాయక్ సహకరించలేదని కత్తి వెంకటస్వామి ఆరోపించడంతో గొడవ మొదలైంది. స్వతంత్ర అభ్యర్థి దొంతికి సహకరించారని, తనకు సహకరించని పార్టీ నేతలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు అమ్ముడుపోయావని వెంకటస్వామిపై నాయక్ ధ్వజమెత్తాడు. ఇరువురి మధ్య మాటామాట పెరగడంతో మిగిలిన వారు కలుగచేసుకుని వారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ వ్యతిరేకులపై చర్యలు ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నట్లు పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ వ్యతిరేకులను గుర్తించి నివేదిక సమర్పించాలని డీసీసీ బాధ్యులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే క్యాంప్‌లు నిర్వహించి చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేలా శ్రద్ధ వహించాలని నాయకులకు ఆయన సూచించినట్లు తెలిసింది. ముగ్గురు గైర్హాజరు ఈ సమావేశానికి టీ పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాకు చెందిన ముగ్గురు అభ్యర్థులు డుమ్మా కొట్టారు. స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్, వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేలుగా పోటీచేసిన డాక్టర్ విజయరామారావు, మాలోతు కవిత, కొండేటి శ్రీధర్ గైర్హాజరయ్యారు. విజయరామారావు, శ్రీధర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా కవిత తిరుపతికి దైవదర్శనానికి వెళ్లారు. సమావేశంలో మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, డీఎస్. రెడ్యానాయక్, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు పొదెం వీరయ్య, దుగ్యాల శ్రీనివాసరావు, కత్తి వెంకటస్వామి, ఎర్రబెల్లిస్వర్ణ, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి డాక్టర్ హరిరమాదేవి, శ్రీరాంభద్రయ్య, పి.లక్ష్మణ్‌గౌడ్, కృష్ణమూర్తి, జిల్లా నాయకులు వరద రాజేశ్వర్‌రావు, ఈవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొండేటికి పరామర్శ సమావేశం అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొండేటి శ్రీధర్, విజయరామారావును జిల్లా కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. -
కత్తి వెంకటస్వామి బీఫారంపై ఫిర్యాదు
వరంగల్:జిల్లాలోని నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ అంశం పార్టీలో అగ్గి రాజేస్తోంది. గురువారం జేఏసీ నేత కత్తి వెంకటస్వామి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ పై టికెట్ ఆశించి భంగపడ్డ డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి ఫిర్యాదు చేశారు. కత్తి దాఖలు చేసిన నామినేషన్ లో కొట్టి వేతలున్నాయంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన టి.కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకున్న పలు మార్పులు తలనొప్పిగా మారాయి. కొంతమంది సిట్టింగ్ లను దూరంగా పెట్టి, పార్టీలో అప్పుడే చేరిన వారికి టికెట్లు కేటాయించడంపై అసంతృప్తి వాదులు నిరసన గళం వినిపిస్తున్నారు. మాల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని మల్కాజిగిరి, కంటోన్మెంట్ స్థానాల్లో తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్.. వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ పై కూడా వెనక్కి తగ్గింది. ముందుగా మాధవరెడ్డిని పేరును జాబితాలో చేర్చిన కాంగ్రెస్ పెద్దలు అనంతరం కత్తి వెంకటస్వామికి కేటాయించారు. దీంతో ఆ జిల్లా కాంగ్రెస్ లో నిరసన గళం వినిపిస్తోంది. ఒక్కసారి ఇచ్చిన టికెట్ ను వెనక్కి తీసుకోవడం సరికాదంటూ కేంద్రమంత్రి బలరాం నాయక్ సైతం ఖండించిన విషయం తెలిసిందే. ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి టికెట్ నిరాకరించి..పార్టీతో సంబంధం లేని జేఏసీ నేత కత్తి వెంకటస్వామికి ఇవ్వడం ఎంతమాత్రం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్లు కూడా పార్టీ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఈ అంశం తీవ్ర వివాదం అయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ కు తెలిపిన ఏమాత్రం ప్రయోజనం కనబడలేదు. -
'పొన్నాల నమ్మకం ద్రోహం వల్లే టికెట్ పోయింది'
వరంగల్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై డీసీసీ అధ్యక్షుడు దొంతు మాధవరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొన్నాల నమ్మకద్రోహం వల్లే తనకు కేటాయించిన నర్సంపేట టికెట్ చేజారిందని దొంతు మాధవరెడ్డి ఆరోపించారు. అయితే తనకు నర్సంపేట టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని మాధవరెడ్డి హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న తనకు టికెట్ కేటాయించిన తర్వాత మరో వ్యక్తికి ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్దితో సేవలందించిన తనను అవమానించారని తన అనుచరులతో వాపోయినట్టు సమాచారం. నర్సంపేట టికెట్ ను జేఏసీ కోటాలో లెక్చరర్ జేఏసీ చైర్మన్ కత్తి వెంకటస్వామికి కేటాయించిన సంగతి తెలిసిందే.