కత్తి వెంకటస్వామి బీఫారంపై ఫిర్యాదు | donthi madhava reddy complaint over b form of katti venkataswamy | Sakshi
Sakshi News home page

కత్తి వెంకటస్వామి బీఫారంపై ఫిర్యాదు

Published Thu, Apr 10 2014 2:43 PM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

donthi madhava reddy complaint over b form of katti venkataswamy

వరంగల్:జిల్లాలోని నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ అంశం పార్టీలో అగ్గి రాజేస్తోంది. గురువారం జేఏసీ నేత కత్తి వెంకటస్వామి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ పై టికెట్ ఆశించి భంగపడ్డ డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి ఫిర్యాదు చేశారు. కత్తి దాఖలు చేసిన నామినేషన్ లో కొట్టి వేతలున్నాయంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన టి.కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో  చోటు చేసుకున్న పలు మార్పులు తలనొప్పిగా మారాయి. కొంతమంది సిట్టింగ్ లను దూరంగా పెట్టి, పార్టీలో అప్పుడే చేరిన వారికి టికెట్లు కేటాయించడంపై అసంతృప్తి వాదులు నిరసన గళం వినిపిస్తున్నారు.

 

మాల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని మల్కాజిగిరి, కంటోన్మెంట్ స్థానాల్లో తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్..  వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ పై కూడా వెనక్కి తగ్గింది. ముందుగా మాధవరెడ్డిని పేరును జాబితాలో చేర్చిన కాంగ్రెస్ పెద్దలు అనంతరం కత్తి వెంకటస్వామికి కేటాయించారు. దీంతో ఆ జిల్లా కాంగ్రెస్ లో నిరసన గళం వినిపిస్తోంది. ఒక్కసారి ఇచ్చిన టికెట్ ను వెనక్కి తీసుకోవడం సరికాదంటూ కేంద్రమంత్రి బలరాం నాయక్ సైతం ఖండించిన విషయం తెలిసిందే.

 
ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి టికెట్ నిరాకరించి..పార్టీతో సంబంధం లేని జేఏసీ నేత కత్తి వెంకటస్వామికి ఇవ్వడం ఎంతమాత్రం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్లు కూడా పార్టీ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఈ అంశం తీవ్ర వివాదం అయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ కు తెలిపిన ఏమాత్రం ప్రయోజనం కనబడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement