దోపిడీకి దొంగల విఫలయత్నం | Failed to exploit the pirates | Sakshi
Sakshi News home page

దోపిడీకి దొంగల విఫలయత్నం

Published Thu, Sep 22 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

Failed to exploit the pirates

నర్సంపేట : పట్టణంలోని సిద్దార్థ నగర్‌ కాలనీకి చెందిన అర్శనపల్లి మాధవరావు ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. అర్శనపల్లి మాధవరావు కుటుం బ సభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి ఇంటికి 10 రోజుల క్రితం వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపులను పగులగొట్టి బెడ్రూం డోర్లు తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. 
సెంటర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ ఉండడంతో డోర్లు తెరుచుకోలేదు. పనిమనిషి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి చూడగా డోర్లు తెరిచి ఉండడంతో చుట్టుపక్కల వారికి తెలిపింది. కాలనీ ప్రజలు హైదరాబాద్‌లో ఉన్న మాధవరావుకు సమాచారమివ్వడంతో ఇంటికి చేరుకున్నారు. టౌ¯ŒS సీఐ జా¯ŒSదివాకర్, ఎస్సై రాజువర్మ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి క్లూస్‌ టీంను పిలిపించి వేలిముద్రలను సేకరించారు. అనంతరం డాగ్‌స్కాడ్‌ బృందం కూడా విచారణ చేయగా వివరాలు లభించలేదు. సీఐ చు ట్టు పక్కల కాలనీల్లో అద్దెకు ఉంటున్న విద్యార్థుల గదుల్లో తనిఖీలు చేపట్టి అనుమానితులను వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళితే ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస చోరీ ఘటనల నేపథ్యంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement