narsam pet
-
వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి : నర్సంపేట
-
దోపిడీకి దొంగల విఫలయత్నం
నర్సంపేట : పట్టణంలోని సిద్దార్థ నగర్ కాలనీకి చెందిన అర్శనపల్లి మాధవరావు ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. అర్శనపల్లి మాధవరావు కుటుం బ సభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి ఇంటికి 10 రోజుల క్రితం వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపులను పగులగొట్టి బెడ్రూం డోర్లు తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉండడంతో డోర్లు తెరుచుకోలేదు. పనిమనిషి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి చూడగా డోర్లు తెరిచి ఉండడంతో చుట్టుపక్కల వారికి తెలిపింది. కాలనీ ప్రజలు హైదరాబాద్‌లో ఉన్న మాధవరావుకు సమాచారమివ్వడంతో ఇంటికి చేరుకున్నారు. టౌ¯ŒS సీఐ జా¯ŒSదివాకర్, ఎస్సై రాజువర్మ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలను సేకరించారు. అనంతరం డాగ్‌స్కాడ్ బృందం కూడా విచారణ చేయగా వివరాలు లభించలేదు. సీఐ చు ట్టు పక్కల కాలనీల్లో అద్దెకు ఉంటున్న విద్యార్థుల గదుల్లో తనిఖీలు చేపట్టి అనుమానితులను వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళితే ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస చోరీ ఘటనల నేపథ్యంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
మృతదేహంతో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా
వరంగల్: వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు గండె పోటుతో మృతి చెందాడు. జిల్లాలోని నర్సంపేటకు చెందిన తొగరు కుమారస్వామి గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందాడు. అయితే కుమార స్వామి మృతికి డీఎం వేధింపులే కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం మృత దేహంతో నర్సంపేట డిపో ఎదుట కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
ఆటోను ఢీకొన్న లారీ : ఇద్దరి మృతి
శ్రీకాకుళం : వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న ఆటో, బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నర్సీంపేట మండలంలోని జాతీయరహాదారి-16పై జరిగింది. ఈ ప్రమాదంలో లారీ అదుపుతప్పి వాహనాలను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (నర్సంపేట) -
కత్తి వెంకటస్వామి బీఫారంపై ఫిర్యాదు
వరంగల్:జిల్లాలోని నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ అంశం పార్టీలో అగ్గి రాజేస్తోంది. గురువారం జేఏసీ నేత కత్తి వెంకటస్వామి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ పై టికెట్ ఆశించి భంగపడ్డ డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి ఫిర్యాదు చేశారు. కత్తి దాఖలు చేసిన నామినేషన్ లో కొట్టి వేతలున్నాయంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన టి.కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకున్న పలు మార్పులు తలనొప్పిగా మారాయి. కొంతమంది సిట్టింగ్ లను దూరంగా పెట్టి, పార్టీలో అప్పుడే చేరిన వారికి టికెట్లు కేటాయించడంపై అసంతృప్తి వాదులు నిరసన గళం వినిపిస్తున్నారు. మాల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని మల్కాజిగిరి, కంటోన్మెంట్ స్థానాల్లో తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్.. వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ పై కూడా వెనక్కి తగ్గింది. ముందుగా మాధవరెడ్డిని పేరును జాబితాలో చేర్చిన కాంగ్రెస్ పెద్దలు అనంతరం కత్తి వెంకటస్వామికి కేటాయించారు. దీంతో ఆ జిల్లా కాంగ్రెస్ లో నిరసన గళం వినిపిస్తోంది. ఒక్కసారి ఇచ్చిన టికెట్ ను వెనక్కి తీసుకోవడం సరికాదంటూ కేంద్రమంత్రి బలరాం నాయక్ సైతం ఖండించిన విషయం తెలిసిందే. ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి టికెట్ నిరాకరించి..పార్టీతో సంబంధం లేని జేఏసీ నేత కత్తి వెంకటస్వామికి ఇవ్వడం ఎంతమాత్రం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్లు కూడా పార్టీ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఈ అంశం తీవ్ర వివాదం అయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ కు తెలిపిన ఏమాత్రం ప్రయోజనం కనబడలేదు. -
విద్యార్థుల కన్నీరు...
నర్సంపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతోపాటు కనీస వసతులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం... అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. జిల్లాలో 678 ప్రాంతాల్లో నీటి సవుస్యను పరిష్కరించేందుకు రూ.5.68 కోట్ల వ్యయుంతో వసతులు కల్పించాలని సర్కారు గత ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన ప్రొసిడింగ్ నంబర్ జే-2/డీడబ్లూఎస్సీ/133 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సవుస్యలు తీర్చేందుకు ఎంపిక చేసిన ఒక్కో పాఠశాలకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వుంజూరు చేసింది. ఆయూ ప్రాంతాల్లో చేతిపంపులు, నల్లాలు ఏర్పాటు చేయడంతోపాటు బోరు బావులు తవ్వించి వినియోగంలోకి తేవాలి. ఇందులో భాగంగా నీటి సౌకర్యం లేని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బోరుబావులు తవ్వారు. కానీ... వాటిని వినియోగంలోకి తేవడంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఇప్పటివరకు 50 శాతం మేర వినియోగంలోకి రాలేదు. నర్సంపేట డివిజన్లోని నెక్కొండ, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం వుండలాల్లో 150 బోర్లు వేరుుంచి ట్యాంకులు నిర్మించడంతోపాటు పంపుసెట్లు, నల్లాలు ఏర్పాటు చేయూల్సి ఉంది. ఈ బాధ్యతను గ్రామీణ తాగు నీటి సరఫరా విభాగం అధికారులకు అప్పగించారు. గత వేసవి సెలవుల నుంచి ఆయూ పాఠశాలల్లో 64 బోర్లు వూత్రమే వేరుుంచారు. ఇందులో సగం మేర ఇంకా వినియోగంలోకి రాలేదు. ఉన్న వాటినీ ఎందుకు వినియోగించుకోవడంలేదని అధికారులను ఆరా తీస్తే... ‘ప్రస్తుతం ఉన్న ప్రత్యావ్నూయు ఏర్పాట్లు దూరమైతే... వాటిని వినియోగంలోకి తెస్తాం.’ అని సవూధానం చెప్పడం గమనార్హం.