నర్సంపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతోపాటు కనీస వసతులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం... అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. జిల్లాలో 678 ప్రాంతాల్లో నీటి సవుస్యను పరిష్కరించేందుకు రూ.5.68 కోట్ల వ్యయుంతో వసతులు కల్పించాలని సర్కారు గత ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన ప్రొసిడింగ్ నంబర్ జే-2/డీడబ్లూఎస్‌సీ/133 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సవుస్యలు తీర్చేందుకు ఎంపిక చేసిన ఒక్కో పాఠశాలకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వుంజూరు చేసింది. ఆయూ ప్రాంతాల్లో చేతిపంపులు, నల్లాలు ఏర్పాటు చేయడంతోపాటు బోరు బావులు తవ్వించి వినియోగంలోకి తేవాలి. ఇందులో భాగంగా నీటి సౌకర్యం లేని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బోరుబావులు తవ్వారు. కానీ... వాటిని వినియోగంలోకి తేవడంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు.
ఇప్పటివరకు 50 శాతం మేర వినియోగంలోకి రాలేదు. నర్సంపేట డివిజన్‌లోని నెక్కొండ, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం వుండలాల్లో 150 బోర్లు వేరుుంచి ట్యాంకులు నిర్మించడంతోపాటు పంపుసెట్లు, నల్లాలు ఏర్పాటు చేయూల్సి ఉంది. ఈ బాధ్యతను గ్రామీణ తాగు నీటి సరఫరా విభాగం అధికారులకు అప్పగించారు. గత వేసవి సెలవుల నుంచి ఆయూ పాఠశాలల్లో 64 బోర్లు వూత్రమే వేరుుంచారు.
ఇందులో సగం మేర ఇంకా వినియోగంలోకి రాలేదు. ఉన్న వాటినీ ఎందుకు వినియోగించుకోవడంలేదని అధికారులను ఆరా తీస్తే... ‘ప్రస్తుతం ఉన్న ప్రత్యావ్నూయు ఏర్పాట్లు దూరమైతే... వాటిని వినియోగంలోకి తెస్తాం.’ అని సవూధానం చెప్పడం గమనార్హం.
విద్యార్థుల కన్నీరు...
Published Sat, Jan 18 2014 6:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement