officers neglect
-
అధికారుల నిర్లక్ష్యమే..!
ప్రభుత్వ కళాశాలలో టాయిలెట్ల సమస్యపై పట్టించుకోని అధికారులు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యం ’సాక్షి’ కథనంతో కదలిక.. అధికారులపై కలెక్టర్ సీరియస్ సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మరుగుదొడ్ల దుస్థితికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. టాయిలెట్ల సమస్య తీవ్రంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని తేలింది. మూడేళ్లుగా టాయిలెట్ల కోసం మున్సిపల్, కలెక్టర్, విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు కళాశాల సిబ్బంది పలుమార్లు ఉన్నతాధి కారులకు లేఖలు రాశారు. సమస్య తీవ్రతను అందరికీ వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా గతంలో ఉన్న గిరిజాశంకర్ దృష్టికి 2014 ఫిబ్రవరి 4న కాలేజీ పరిస్థితిని వివరిస్తూ అప్పటి ప్రిన్సిపాల్ ఎన్.జనార్దన్‌గౌడ్ ఒక నివేదిక అందజేశారు. అరుునా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మాధ్యమిక విద్యా శాఖకు 2016 జనవరి 5న కాలేజీ అప్పటి ప్రిన్సిపాల్ వెంకయ్య నాయక్ మరోసారి లేఖ రాశారు. అంతకు ముందు మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కాగా, మంగళవారం ’సాక్షి’లో ప్రచు రితమైన ‘చెప్పుకోలేని బాధ’ కథనంతో అధికార యంత్రాంగమంతా కదిలింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కన్నెర్ర చేయడంతో జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. శుక్ర వారం స్వయంగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ కాలేజీ పరిసరాలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న ఆరు మరుగుదొడ్లకు అదనంగా మరో 20 నిర్మించాలని సిబ్బందిని ఆదేశించారు. -
గ్యాస్ కనెక్షన్ల మంజూరులో నిర్లక్ష్యం
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల మహిళలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 75 వేల మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 1653 కనెక్షన్లు మాత్రమే అందించారు. దీపం, సీఎస్ఆర్ వంటి కనెక్షన్లు ఇవ్వడానికి కేటాయింపులు అధికంగానే ఉన్నప్పటికీ వాటిని లబ్ధిదారులకు అందించడంలో యంత్రాంగం చొరవ చూపడం లేదు. జిల్లాకు గతంలో 16 వేల దీపం కనెక్షన్లు మంజూరయ్యాయి. వాటిని ఎవరికీ అందజేయలేదు. ఆ తరువాత సీఎస్ఆర్ పేరుతో ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చారు. దీంతో జిల్లాలో 69, 990 మంది దరఖాస్త్తు చేసుకున్నారు. వీటిని కాచి వడపోసిన అధికారులు 55,125 మందిని అర్హులుగా తేల్చారు. అయితే ఐఓసీ, హెచ్పీసీలు ఒక్క గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వకపోగా బీపీసీ కంపెనీ ఏజెన్సీలు 1653 కనెక్షన్లు మాత్రే ఇచ్చాయి. గతంలో దీపం పథకం కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా కనెక్షన్లు రాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సీఎస్ఆర్ పేరుతో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటికీ కనెక్షన్లు రిలీజ్ చేయలేదు. రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు అధికార పార్టీ నాయకులు తాము చెప్పిన వారికే ఇవ్వాలని మెలిక పెట్టడంతో కనెక్షన్ మంజూరులో జాప్యం జరుగుతోందని సమాచారం. ఆ మూడు నియోజకవర్గాలకు మరో 5 వేల కనెక్షన్లు జిల్లాలో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ల పంపిణీ పెండింగ్‌లో ఉంటే జిల్లాకు మరో 5 వేల కనెక్షన్లు మంజూరయ్యాయి. చీపురుపల్లి, ఎస్. కోట, విజయనగరం నియోజకవర్గాల్లో ఈ కనెక్షన్లు ఇచ్చేందుకు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యే, మంత్రులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. చీపురుపల్లికి రెండు వేల కనెక్షన్లు, ఎస్. కోట, విజయనగరం నియోజకవర్గాలకు 1500 చొప్పున గ్యాస్ కనెక్షన్లు మంజూ ర య్యాయి. వీటిని త్వరలో పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా కనెక్షన్లు పెండింగ్‌లో ఉండడంతో ప్రస్తుతం మంజూరైన అదనపు గ్యాస్ కనెక్షన్లు మరింత జాప్యం అవుతాయా ? లేక వెంటనే పంపిణీ చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే!. -
ఆందోళనకు దిగిన ఓటర్లు
వెల్దుర్తి, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యంతో బ్యాలెట్ పేపర్లు తప్పల తడకగా మారాయి. విషయాన్ని గమనించిన ఓటర్లు ఆందోళనకు దిగడంతో కాసేపు పోలింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఎంపీటీసీ పో లింగ్‌ను వాయిదా వేసి జెడ్పీటీసీ పోలిం గ్ను నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే..వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని చర్లపల్లి గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌స్టేషన్ నం.6లో వెల్దుర్తి-2 ఎంపీటీసీ ఎన్నికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఎంపీటీసీ బ్యాలెట్ రెండో బండిల్‌లోని సీరియల్ నం. 2051 నుండి 2100 వరకు ఉన్న 50 బ్యాలెట్ పేపర్లుండగా 2051 నుండి 2065 వరకు వెల్దుర్తి ఎంపీటీసీ-2 నమూన బ్యాలెట్ సరిగానే అచ్చు అయ్యాయి. అయితే 2066 నుండి 2100 వరకు ఉన్న బ్యాలెట్ పేపర్లలో వెల్దుర్తి ఎంపీటీసీ-1 నమూన బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. 44 బ్యాలెట్ పత్రాల్లో గుర్తులు, పేర్లు తప్పుగా ప్రచురితమయ్యాయి. దీనిని ఓటర్లు గమనిం చి అందోళన చేపట్టారు. అప్పటికే ఈ బెండిల్లో 29 ఓట్లు పోలయ్యాయి. విష యం తెలిసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుభాషిణి పోలింగ్ కేంద్రానికి చేరుకొని బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. ఉదయం 8 గంటల నుండి 9.30 గంటల వరకు పోలింగ్ నిలిపివేశారు. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద పడిగాపులుకాశారు. ఎన్నికల అధికారులకు, కలెక్టర్‌కు అధికారిణి సుభాషిణి విషయాన్ని ఫోన్ ద్వారా వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 9.30 గంటలకు కేవలం జెడ్పీటీసీ ఎన్నికలను మత్రమే ప్రారంభించి ఎంపీటీసీ పోలింగ్‌ను నిలిపివేశారు. త్వరలో రీపోలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష ్యంతోనే రీపోలింగ్: జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం స్థానిక ఎన్నికల అధికారులు, పీఓలు, ఏపీఓల నిర్లక్ష్యమే రీపోలింగ్‌కు దారి తీసిందని జిల్లా పరిషత్ సీఈఓ ఆశీర్వాదం పేర్కొన్నారు. పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలుసుకున్న జడ్పీ సీఈఓ ఆశీర్వాదం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ పత్రాలను పరిశీలించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ఆదివారం రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. -
ఆరో రోజూ ఆందోళన
భైంసా, న్యూస్‌లైన్ : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరసనలు శుక్రవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. తమతోపాటే చదివే ఈ-4 విద్యార్థి నాగరాజు భవనంపై నుంచి దూకి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా సిబ్బంది పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఆర్జేయూకేటీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి ఇక్కడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వివాదాస్పద అధికారులకే ప్రాధాన్యం కళాశాల ప్రారంభంలో నియమితులైన ట్రిపుల్ ఐటీ అధికారులే వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఈ అధికారులను తొలగించాలంటూ కళాశాల విద్యార్థులు ఇప్పటికే ప లు పర్యాయాలు రోడ్డెక్కారు. గతంలో వారిని తొలగిస్తున్నట్లు తెల్లకాగితాలపై రాజీనామాలను తీసుకుని మళ్లీ వారినే కొనసాగించారు. సమస్యలపై గళం విప్పిన విద్యార్థులను ఈ అధికారులు టార్గెట్ చేస్తున్నారు. ఈ అధికారులను పక్కకు తప్పించాల్సిన ఆర్జే యూకేటీ ఉన్నతాధికారులు ప్రతిసారి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఆందోళనబాట పట్టిన విద్యార్థులకు హైదరాబాద్ నుంచి రిజిస్టార్ సోమయ్యను పంపి చర్చించారు. అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు విద్యార్థులకు హామీ ఇచ్చినా ఈ విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఈసారి కళాశాలలోనే ఆందోళన కొన సాగిస్తున్నారు. ట్రిపుల్ ఐటీపై ఆర్జేయూకేటీ వీసీ దృష్టి సారించి ప్రక్షాళన చేస్తేనే దీక్ష విరమిస్తామని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు. కాగా.. విద్యార్థులు ఆలస్యంగా వచ్చారని ఇప్పటి వరకు రూ.30 లక్షల మేర కళాశాల సిబ్బంది అపరాధ రుసుం వసూలు చేసిందని, ఆ డబ్బును మృతుడి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏదీ ఉపాధి!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామాల్లో వలసలను నివారించేందుకు, అందరికీ బతుకుదెరువు కల్పించేందుకు ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం(ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్) పూర్తి భరోసా ఇవ్వలేకపోతోంది. జాబ్‌కార్డులు పొందిన కుటుంబాలన్నింటికి వందరోజుల పని దొరకడం లేదు. ఉపాధిహామీ పథకం అమలులో జిల్లా రాష్ట్రస్థాయిలో ఐదోస్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నా.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కూలీలందరికీ పని దొరకని పరిస్థితి. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 11నెలలు గడుస్తున్నా.. సరిపడే నిధులున్నా కూలీలందరికీ వందరోజుల పని కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. స్థానికంగా ‘ఉపాధి’లేక కూలీలు మళ్లీ వలసబాట పడుతున్నారు. జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి బతుకదెరువు కోసం కూలీలు వలస వెళ్తుండటం ఈ పథకం అమలు తీరుకు అద్దంపడుతోంది. పక్కా ప్రణాళికలు ఉన్నా.. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి *557.62 కోట్లతో పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని 36 మండలాలకు చెందిన 719 పంచాయతీలు, 1,297 హాబిటేషన్లలో ఈ పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 4,45,117మంది కూలీలకు జాబ్‌కార్డులు అందజేసిన అధికారులు 25,653 ఎస్.ఎస్.ఎస్. గ్రూపుల ద్వారా ఉపాధి కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా 557.62 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక వేశారు. అందులో ఇప్పటి వరకు 203.50 కోట్లు ఖర్చు చేసి 50,149 పనులు చేసినట్లు చెబుతున్నారు. అయితే 2,19,236 కుటుంబాల్లో కేవలం 14,578 కుటుంబాలకు మించి వందరోజుల పని కల్పించలేకపోయారు. అధికారులు ప్రణాళికలు బాగానే వేసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరించడం లేదు. ఇప్పటికీ 45 శాతం గ్రామాలలో ఉపాధి పనులు ఇంకా మొదలవలేదు. శివారు గ్రామాల్లోనైతే ఉపాధి హామీ పనులను మొక్కుబడిగా ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా జనవరి, ఫిబ్రవరి వరకు నిధులను ఖర్చు చేయకుండా మార్చిలో హడావుడి చేశారు. 50రోజుల్లో లక్ష్యం పూర్తయ్యేనా.. ఈ ఆర్థిక సంవత్సరానికి 2013 మార్చిలో *557.62 కోట్లతో ఉపాధి పనులను ప్రారంభించగా సుమారు పదిన్నర మాసాల్లో *203.50 కోట్లు ఖర్చు చేశారు. మిగతా *354.12 కోట్లు ఈ ఏడాది మార్చి మాసాంతానికి ఖర్చు చేస్తారా..? కూలీలందరికీ పనికల్పిస్తారా..? అసలు ఎంపిక చేసిన పనులన్నీ పూర్తి అవుతాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధిహామీ పథకం కింద ఈ ఏడాది ప్రణాళికలో చేర్చిన నిధులు వచ్చే ఏడాదిలో ఖర్చు చేసే అవకాశం ఉంది. కానీ ఈ ఏడాదిలో కూలీల ఉపాధికి మాత్రం గండిపడినట్లే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఉపాధిహామీ పథకం అమలుపై మరింత దృష్టి సారించి, గ్రామాల్లో వలసలను నివార్సించాల్సిన అవసరముంది. -
నిధులున్నా..నీరసమే
మార్కాపురం, న్యూస్‌లైన్: ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలన్న ప్రభుత్వ సంకల్పం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్ విజయకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టినా..ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. నిధులున్నా లబ్ధిదారులకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యంతో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వివిధ మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. ఉపాధి హామీ పథకం కింద నిర్మించుకునే మరుగుదొడ్డికి రూ 10,200 ఖర్చవుతుందని అంచనా. కేంద్రం రూ 4,800, రాష్ట్ర ప్రభుత్వం రూ 4,500, లబ్ధిదారుని వాటా రూ 900గా నిర్ణయించారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు ఉంటే నగదును ప్రభుత్వం దశల వారీగా లబ్ధిదారునికి అందజేస్తుంది. వీటి బాధ్యతను ఉపాధి హామీ సిబ్బందికి కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి 56 మండలాల్లో 2,01,982 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 75 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయి. మార్కాపురం మండలంలో 3,540కి గానూ 1153 పూర్తయ్యాయి. తర్లుపాడు మండలంలో 3317కు గానూ 1139, కొనకనమిట్ల మండలంలో 5306కు గానూ 1085, కురిచేడులో 4082కు గానూ 1104, దొనకొండలో 4334కు గాను 1019 మాత్రమే పూర్తయ్యాయి. దోర్నాల మండలంలో 4885కు గానూ 1705, కొనకనమిట్ల 5306కు గాను 1082, పెద్దారవీడు 4483కు గాను 1622, పుల్లలచెరువు 3576కు గాను 1244, తర్లుపాడు 3317కు గాను1135, త్రిపురాంతకం 4721కు గాను 1280, యర్రగొండపాలెం 4729కు గాను 1603 వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తయ్యాయి. ఈ నిర్మాణాలను చూస్తే పథకం అమలు ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక నిర్మాణం పూర్తయి బిల్లులు రాని వ్యక్తిగత మరుగుదొడ్లు ఈ ఐదు మండలాల్లో సుమారు 1400 వరకు ఉన్నాయి. ఏడాది క్రితం మరుగుదొడ్లు నిర్మించుకున్నప్పటికీ బిల్లులు చెల్లించకపోవటంతో కొత్తగా నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి సుమారు రూ 13 వేలు ఖర్చవుతుండగా, ప్రభుత్వం రూ 10,200 మాత్రమే అందజేస్తుంది. అయినా కట్టుకున్న వెంటనే బిల్లులు చెల్లించడం లేదు. దీంతో లబ్ధిదారుల్లో నిరాసక్తత ఏర్పడింది. పది రోజుల్లో ఇస్తాం.. సుందరరావు, అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉపాధి హామీ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకున్న వారికి 15వ తేదీలోపు బిల్లులు చెల్లిస్తాం. జాప్యం జరిగిన మాట వాస్తవమే. లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు గ్రామాల్లో తిరుగుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందికి మెమోలు ఇస్తున్నాం. ఏడాదైనా బిల్లు రాలేదు జానపాటి సుబ్బమ్మ, వేములకోట ఏడాది కిందట మరుగుదొడ్డి నిర్మించుకున్నా బిల్లులు రాలేదు. ఎప్పుడు అడిగినా అదిగో ఇదిగో అంటూకాలం గడుపుతున్నారు. దీంతో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే దాని కంటే రూ 2వేలు అదనంగా ఖర్చు చేస్తున్నా, ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వకుండా తిప్పుతున్నారు. -
విద్యార్థుల కన్నీరు...
నర్సంపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతోపాటు కనీస వసతులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం... అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. జిల్లాలో 678 ప్రాంతాల్లో నీటి సవుస్యను పరిష్కరించేందుకు రూ.5.68 కోట్ల వ్యయుంతో వసతులు కల్పించాలని సర్కారు గత ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన ప్రొసిడింగ్ నంబర్ జే-2/డీడబ్లూఎస్సీ/133 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సవుస్యలు తీర్చేందుకు ఎంపిక చేసిన ఒక్కో పాఠశాలకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వుంజూరు చేసింది. ఆయూ ప్రాంతాల్లో చేతిపంపులు, నల్లాలు ఏర్పాటు చేయడంతోపాటు బోరు బావులు తవ్వించి వినియోగంలోకి తేవాలి. ఇందులో భాగంగా నీటి సౌకర్యం లేని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బోరుబావులు తవ్వారు. కానీ... వాటిని వినియోగంలోకి తేవడంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఇప్పటివరకు 50 శాతం మేర వినియోగంలోకి రాలేదు. నర్సంపేట డివిజన్లోని నెక్కొండ, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం వుండలాల్లో 150 బోర్లు వేరుుంచి ట్యాంకులు నిర్మించడంతోపాటు పంపుసెట్లు, నల్లాలు ఏర్పాటు చేయూల్సి ఉంది. ఈ బాధ్యతను గ్రామీణ తాగు నీటి సరఫరా విభాగం అధికారులకు అప్పగించారు. గత వేసవి సెలవుల నుంచి ఆయూ పాఠశాలల్లో 64 బోర్లు వూత్రమే వేరుుంచారు. ఇందులో సగం మేర ఇంకా వినియోగంలోకి రాలేదు. ఉన్న వాటినీ ఎందుకు వినియోగించుకోవడంలేదని అధికారులను ఆరా తీస్తే... ‘ప్రస్తుతం ఉన్న ప్రత్యావ్నూయు ఏర్పాట్లు దూరమైతే... వాటిని వినియోగంలోకి తెస్తాం.’ అని సవూధానం చెప్పడం గమనార్హం. -
కాటేసిన కరెంటు
పాపన్నపేట/చేగుంట/ ఝరాసంగం,న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు సంఘటనలో కరెంట్ ముగ్గురిని బలితీసుకుంది. వరి నారుకు నీరు పార బెట్టేందుకు వెళ్లిన యువ రైతు విద్యుదాఘాతానికి గురికాగా.. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి మరో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పాపన్నపేట మండలం దూమ్లా తండాకు చెందిన దరావత్ లాల్య, సాలి దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉన్న రెండెకరాల భూమిలో వరి, మొక్కజొన్న పంటలు వేసుకున్నారు. వరి నారు ఎండిపోతుండడంతో బుధవారం సాయంత్రం నీరు పార బెట్టేందుకు పెద్ద కొడుకు ధరావత్ పీర్యా (25) తన భార్య శాంతితో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. అయితే భార్య పొలంలో ఓ వైపు సేద తీరింది. మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చిన త్రీ ఫేస్ కరెంట్‌తో వడి నారుకు నీరు పెట్టాడు. అయితే రోజు లాగానే సాయంత్రం 6 గంటలకు పోయింది. దీంతో తెల్లవారుజాము 3 గంటల వరకు త్రీఫేస్ కరెంట్ రాదన్న ధీమాతో పీర్యా తన బోరుకు సంబంధించిన స్టార్టర్ డబ్బా వద్ద పాడైన కరెంట్ తీగలను మరమ్మతు చేసేందుకు పనులు ప్రారంభించాడు. అనుకోకుండా త్రీఫేస్ కరెంట్ రావడం, కాళ్ల కింద ఉన్న నీటి కారణంగా విద్యుదాఘాతానికి గురై క్షణాల్లో మృత్యువాతపడ్డాడు. కాగా కరెంటు పోయినా భర్త రాకపోవడంతో భార్య శాంతి మోటారు బోరు వద్దకు వెళ్లి చూడగా.. నీటిపై దుస్తులు తేలియాడుతూ కనిపించాయి. ఆందోళనకు గురైన శాంతి తండాకు వెళ్లి కుటుంబ సభ్యులను పిలుచుకుని వచ్చింది. అప్పటికే పీర్యా విగతజీవుడై కనిపించాడు. చేతికొచ్చిన కుమారుడు దుర్మరణం పాలు కావడంతో కన్నవారు కన్నీరు మున్నీరయ్యారు. కాగా కట్టుకున్నవాడు కళ్లముందే విద్యుదాఘాతానికి గురై మృతి చెందడంతో భార్య శాంతి గుండెలు బాదుకుంది. మృతుడికి అఖిల, నందు అనే చిన్నారులు ఉన్నారు. లైన్‌మన్ ప్రాణాన్ని బలిగొన్న ఏఈ నిర్లక్ష్యం విద్యుత్‌శాఖ ఏఈ నిర్లక్ష ్యంతో లైన్ మన్ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ సంఘటన చేగుంట మండలం చెట్ల తిమ్మాయిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. రామయంపేట మండలం నిజాంపేటకు చెందిన అనిల్ (28) చేగుంట మండలం చెట్ల తిమ్మాయిపల్లి లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా గ్రామంలో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. దీంతో విద్యుత్తు లైన్లను సరిచేయడానికి ఏఈ పెంట్యానాయక్ లైన్‌మన్ అనిల్‌ను తీసుకుని గ్రామానికి చేరుకున్నాడు. ఎల్సీ తీసుకోకుండానే అనుమతి లభించిందని స్తంభం ఎక్కి సరిచేయాలని లైన్‌మన్‌ను ఏఈ పురమాయించాడు. దీంతో స్తంభానికి ఎక్కిన అనిల్ విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. వెంటనే అనిల్‌ను చికిత్స నిమిత్తం తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిల్ మృతి చెందాడని వైద్యులు తెలపారు. ఏఈ పెంట్యానాయక్ అనిల్ మృతదేహాన్ని మాసాయిపేట సబ్‌స్టేషన్‌కు తరలిస్తుండగా మృతుడి బంధువులు అడ్డుకున్నారు. అనంతరం ‘అనిల్ మృతికి నువ్వే కారణమని’ ఏఈపై దాడికి యత్నించారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాన్స్‌కో ఏడీ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ యాదగౌడ్లను రప్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రమాద విషయంలో ఏఈపై శాఖ పరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీసులు ఏఈ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శాంతి భద్రతలను సీఐ గంగధర్‌తో పాటు తూప్రాన్ ఎస్ఐ నిరంజన్‌రెడ్డి, రామయంపేట ఎస్ఐ ప్రవీణ్, ట్రైనీ ఎస్ఐలు శేఖర్‌రెడ్డి, అజ్మతుల్లాలు పర్యవేక్షించారు. నాభర్తను ఏఈ వేధించేవాడు... చేగుంటకు బదిలీ అయిన రోజు నుంచి తన భర్త అనిల్‌ను ఏఈ పెంట్యానాయక్ వేధించేవాడని మృతుడి భార్య జ్యోతి రోదిస్తూ తెలిపింది. తన భర్త అనిల్ మృతికి ఏఈనే కారణమని ఆరోపించింది. మృతుడికి నాలుగేళ్ల లోపు గల కూతుళ్లు కీర్తన, సీయోనాలు ఉన్నారు. ఫ్యూజ్ వేసేందు వెళ్తూ.. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైపోయిన సంఘటన గురువారం ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్గోయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చంద్రయ్య (60) ఎల్గోయి గ్రామంలో పిండి గిర్ణి నడుపుతూ, చిన్న చిన్న విద్యుత్ పనులు చేస్తూ ఉండేవాడు. గ్రామానికి కొత్తగా ట్రాన్స్ఫార్మర్ మంజూరు కావడంతో అధికారులపై మాట్లాడి దానిని ఏర్పాటు చేశాడు. అయితే గ్రామానికి లైన్‌మన్ లేకపోవడంతో గురువారం ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేయడంతో ఫ్యూజ్‌లు బిగిస్తుండడంతో విద్యుదాఘాతానికి గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలొదిలాడు. ఇంటి నుంచి వెళ్లిన కొద్ది సేపటికే చంద్రయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించాడు. మృతుడికి భార్య నీలమ్మతో పాటు కుమారులు ప్రభు, పండరి, దత్తు, శ్రీనివాస్‌లు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే చంద్రయ్య మృతి చెందాడని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు వచ్చే వరకు మృతదేహాన్ని తీసేది లేదన్నారు. సమాచారాన్ని అందుకున్న ట్రాన్స్‌కో డీఈఈ కరీం, ఏడీ శ్రీనివాసచారి, ఏఈ సంతోష్‌లు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించడంతో పాటు కుమారుల్లో ఒకరికి విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.