రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
Kauvery Hospital Released Rajinikanth Health Bulletin: సూపర్ స్టార్ రజినీకాంత్ గురువారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజినీ గురువారం సాయంత్రం హుటాహుటిన ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో జనరల్ చెకప్ కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు ఆయన భార్య లత వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా కావేరీ ఆసుపత్రి వైద్యులు రజనీ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
చదవండి: Rajinikanth Hospitalised: ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించిన వైద్యులు.. అవసమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈరోజు ఆయన సర్జరీ చేసినట్లు చెప్పారు. ఇక త్వరలోనే రజినీకాంత్‌ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆయన తాజాగా నటించిన ‘అన్నాత్తే’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.